Allu Arjun: ఒక సినిమాలోని కంటెంట్ బాగుందంటే.. మిగతా నటీనటులు, దర్శక నిర్మాతలు అంతా కలిసి దానిని ఎంకరేజ్ చేయడానికి ముందుకొస్తారు. ఇప్పటివరకు ‘యానిమల్’, ఇప్పుడు ‘హాయ్ నాన్న’ విషయంలో కూడా అదే జరుగుతోంది. ‘యానిమల్’ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్.. తన ట్విటర్‌లో డీటెయిల్‌గా రివ్యూను అందించాడు. ఇక అదే రేంజ్‌లో ‘హాయ్ నాన్న’ కూడా తనను ఇంప్రెస్ చేసిందని.. తాజాగా ఆ మూవీపై కూడా రివ్యూ ఇచ్చాడు. ఇలా కంటెంట్ బాగున్న ప్రతీ సినిమాకు అల్లు అర్జున్ ఇస్తున్న రివ్యూలు చూసి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.


మీలాగే అందంగా ఉంది..
‘హాయ్ నాన్న టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. ఇదొక స్వీట్ సినిమా. నిజంగా మనసుకు హత్తుకుపోయేలా ఉంది. నాని పర్ఫెర్మెన్స్ చాలా సహజంగా అనిపించింది. ఇలాంటి ఒక స్క్రిప్ట్‌ను వెలుగులోకి తీసుకొచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. డియర్ మృణాల్.. మీ స్వీట్‌నెస్‌ స్క్రీన్ మొత్తం నిండిపోయింది. అది కూడా మీలాగే అందంగా ఉంది. బేబీ కియారా.. నువ్వు నా డార్లింగ్ అయిపోయావు. నీ క్యూట్‌నెస్‌తో అందరి మనసులను కరిగించేస్తున్నావు. చాలు.. ఇక స్కూల్‌కు వెళ్లు (నవ్వుతూ)’’ అంటూ స్క్రీన్‌పై కనిపించిన యాక్టర్ల పర్ఫార్మెన్స్‌ను ప్రశంసించాడు అల్లు అర్జున్.


కన్నీళ్లు పెట్టించావు..
స్క్రీన్‌పై కనిపించే యాక్టర్లతో పాటు స్క్రీన్ వెనుక కష్టపడిన వారి గురించి కూడా అల్లు అర్జున్ ప్రస్తావించారు. ‘‘ఆర్టిస్ట్స్ అందరూ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు కంగ్రాట్స్. టెక్నీషియన్స్ కూడా వారి ప్రతిభను కళ్లకు కట్టినట్టు చూపించారు. ముఖ్యంగా కెమెరామెన్ వర్గీస్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్, డైరెక్టర్ శౌర్యువ్. కంగ్రాట్స్. నీ డెబ్యూతోనే అందరినీ ఇంప్రెస్ చేశావు శౌర్యువ్. నువ్వు ఎన్నో మనసుకు హత్తుకుపోయే, కన్నీళ్లు పెట్టించే సన్నివేశాలను క్రియేట్ చేశావు. ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. ఇలాగే వెలిగిపోతూ ఉండు. ప్రేక్షకుల దగ్గరకు ఇలాంటి ఒక స్వీట్ సినిమాను తీసుకొచ్చినందుకు నిర్మాతలకు కంగ్రాట్స్. ‘హాయ్ నాన్న’ అనేది కేవలం తండ్రులకు మాత్రమే కాదు, ప్రతీ కుటుంబ సభ్యుల హృదయాలను తాకుతుంది’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.






సింగిల్ తండ్రి ప్రేమకథ..
నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హాయ్ నాన్న’ ప్రేక్షకులు అందరిచేత పాజిటివ్ టాక్‌ను అందుకుంటూ ముందుకు వెళ్తోంది. ఒక సింగిల్ తండ్రి ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంతో బేబీ కియారా పర్ఫార్మెన్స్ అందరినీ కట్టిపడేస్తోంది. నాని ఎప్పటిలాగానే తన నేచురల్ నటనతో కన్నీళ్లు పెట్టించాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దర్శకుడు శౌర్యువ్‌కు ఇది మొదటి చిత్రమే అయినా.. కథను మలుపు తిప్పడంలో, యాక్టర్స్‌తో ఎమోషన్స్ పండించడంలో ఫుల్ మార్కులు అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక డెబ్యూతోనే అందరినీ ఇంప్రెస్ చేయడంతో దర్శకుడిగా శౌర్యువ్‌కు టాలీవుడ్‌లోని మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ‘సీతారామం’లాంటి క్లాసిక్ లవ్ స్టోరీలో సీతా మహాలక్ష్మిగా నటించి మెప్పించిన మృణాల్‌కు ‘హాయ్ నాన్న’లోని యశ్న పాత్ర కూడా అదే రేంజ్‌లో గుర్తుండిపోతుందని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు.


Also Read: అనాథ పిల్లల కోసం 'హాయ్ నాన్న' స్పెషల్ స్క్రీనింగ్ - సమంత మంచి మనసుకు ఫ్యాన్స్ ఫిదా!