ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏది చేసినా స‌మ్‌థింగ్‌ స్పెషల్ అన్నట్టు ఉంటుంది. తన సినిమాలు, డ్రస్సింగ్, స్టైల్ దగ్గర నుంచి తాను చేసే ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవడం ఆయనకు అలవాటు. ఈ ఏడాది పుట్టిన రోజును సైతం చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.


ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు (Allu Arjun Birthday). నేడు ఆయన 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం సెర్బియాలోని బెల్‌గ్రేడ్ వెళ్లారు. తనతో పాటు శ్రీమతి అల్లు స్నేహారెడ్డి, 50 మంది క్లోజ్ ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లారు. గ్రాండ్ పార్టీ ఇచ్చారు. "హ్యాపీ ఎట్ 40" అంటూ ఈ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదే విధంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ థాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ ఒక పోస్ట్ చేశారు.   







Also Read: బాలీవుడ్ లో షారుఖ్, ఇక్కడేమో బన్నీ - మురుగదాస్ ప్లాన్ మాములుగా లేదు