నరేశ్ ఇంటి పేరు ఎవరికీ తెలియదు. హీరో నరేశ్ అని చెబితే ప్రేక్షకులు కొంత మంది గుర్తు పట్టకపోవచ్చు. 'అల్లరి' నరేశ్ అంటే తెలుగు ప్రేక్షకులు అందరూ ఠక్కువ గుర్తు పడతారు. సినిమాల్లో ఆయన చేసే అల్లరి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అంతగా నవ్వించింది. అయితే, కొన్నాళ్లుగా ఆయన కామెడీ పక్కన పెట్టి... చాలా సీరియస్ రోల్స్ చేశారు. 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాతో మళ్లీ కామెడీ బాట పట్టారు. అంతే కాదు... ఇంకో కిర్రాక్ అప్డేట్ ఇచ్చారు.


అల్లరోడు రచయితగా 'సుడిగాడు 2'
'అల్లరి' నరేశ్ హీరోగా నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో 'సుడిగాడు' ఒకటి. స్పూఫ్ కామెడీతో ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించింది. అందులో అల్లరోడు ఎంత నవ్వించాడంటే... ఆ తర్వాత మూమూలు కామెడీ సినిమా ఆయన నుంచి వస్తే జనాలకు ఎక్కలేదు. 'అల్లరి' నరేశ్ నుంచి 'సుడిగాడు' లాంటి కామెడీ ఫిల్మ్ కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్లకు హీరో గుడ్ న్యూస్ చెప్పారు. 


'సుడిగాడు 2' స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని 'అల్లరి' నరేశ్ చెప్పారు. ఆయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. అందులో 'కితకితలు' సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ కోరారు. ఆ సినిమా చేసే అవకాశం చూస్తానని నరేశ్ చెప్పారు. ఆ తర్వాత 'సుడిగాడు 2' విషయం బయట పెట్టారు. స్పెషాలిటీ ఏమిటంటే... ఆ సినిమా స్క్రిప్ట్ తాను స్వయంగా రాస్తున్నానని తెలిపారు. వచ్చే ఏడాది ఆ సినిమా ఆడియన్స్ చూస్తారని చెప్పుకొచ్చారు. 


Also Readరెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!



అల్లరి నరేశ్ రక్తంలో రైటింగ్ వుంది. ఫుల్ కామెడీ టచ్ వుంటుంది. ఆయన తండ్రి ఈవీవీ సత్యనారాయణ క్లీన్ కామెడీ ఫిలిమ్స్ ఎన్నో ప్రేక్షకులకు ఇచ్చారు. తండ్రి బాటలో నడుస్తూ ఇప్పుడు నరేశ్ కూడా రైటింగ్ స్టార్ట్ చేశారు. హీరోగా ఫుల్ స్పీడులో వున్నారు కనుక ఇప్పట్లో ఆయన డైరెక్షన్ వైపు అడుగులు వెయ్యడం కష్టం. కానీ, భవిష్యత్తులో డైరెక్ట్ చేసే ఛాన్స్ వుంది.


Also Readప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?



అల్లరోడిని కామెడీ సినిమాల్లో చూడాలని ఆయన ఫ్యాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ కోరుకుంటున్నారు. 'నాంది', 'ఉగ్రం' సినిమాల్లో నటుడిగా ఆయన టాలెంట్ ఆడియన్స్ చూశారు. కొన్నాళ్ల క్రితం 'శంభో శివ శంభో'లోనూ సీరియస్ రోల్ చేశారు. నటుడిగా ఆయన్ను అటువంటి క్యారెక్టర్లలో చూడటం కంటే కామెడీ క్యారెక్టర్లలో చూస్తే బావుంటుందనేది ఫ్యాన్స్ కోరిక. తాను కూడా కామెడీని మిస్ అయ్యానని అల్లరోడు చెప్పారు. కామెడీ ఫిలిమ్స్ చేస్తానని చెబుతున్నారు. ఇక నుంచి అల్లరోడిని సీరియస్ క్యారెక్టర్లతో పాటు కామెడీ సినిమాల్లోనూ ఆడియన్స్ చూడొచ్చు. సంక్రాంతికి వచ్చిన 'నా సామి రంగ'లోనూ ఆయన చేసిన వినోదం అందర్నీ అలరించింది. అయితే అభిమానులకు క్లైమాక్స్ నచ్చలేదు.


Also Readబీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్... ఎర్త్ డే రోజున చెన్నైలో ఓ అందాల భామ ఏం చేసిందో చూశారా?