ఆస్కార్ పురస్కారాలకు నామినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. మన భారత దేశం నుంచి ఏయే సినిమాలను పంపిస్తారనే విషయంలో స్పష్టత లేదు. అయితే... ఎవరెవరి సినిమాలకు ఆస్కార్స్‌కు వెళ్లే అర్హత ఉందనే విషయంలో ఇప్పటి నుంచి డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. మెజారిటీ డిస్కషన్స్‌లో 'ఆర్ఆర్ఆర్' పేరు వినబడుతోంది. ఇప్పుడు ఈ రేసులోకి మరో సినిమా వచ్చింది.
 
ఆస్కార్స్‌కు ఆలియా భట్ సినిమా?
ఆస్కార్ రేసులో ఆలియా భట్ (Alia Bhatt) ఉందని హిందీ సినిమా ఇండస్ట్రీ అంటోంది. అయితే... నటిగా కాదులెండి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'గంగూబాయి కతియావాడి' చిత్రానికి ఆస్కార్ నామినేషన్ లభించే అవకాశం ఉందని ముంబై మీడియా చెబుతోంది. ప్రస్తుతం రేసులో ఉన్న సినిమాలకు ఆలియా భట్ సినిమా గట్టి పోటీ ఇస్తుందని బీ టౌన్ టాక్. ఇండియా నుంచి ఆస్కార్స్‌కు అధికారికంగా పంపే సినిమాగా 'గంగూబాయి కతియావాడి' పేరు ఉండొచ్చట.


అప్పట్లో సంజయ్ లీలా భన్సాలీ 'దేవదాస్'...
ఇప్పుడీ ఆలియా భట్ 'గంగూబాయి కతియావాడి'
'గంగూబాయి కతియావాడి' (Gangubai Kathiawadi) చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించారు. షారుఖ్ ఖాన్ హీరోగా... మాధురీ దీక్షిత్,  ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కథానాయికలుగా ఆయన దర్శకత్వం వహించిన 'దేవదాస్' సినిమా అప్పట్లో ఆస్కార్స్ దగ్గర దగ్గరకు వెళ్ళింది. ఆ తర్వాత మరో భారతీయ సినిమా వెళ్ళలేదు. సాధారణంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు లభిస్తాయి. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'గంగూబాయి కతియావాడి' ప్రదర్శించగా... ప్రేక్షకులు అందరూ నిలబడి మరీ చప్పట్లతో అభినందించారు.
 
ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా ఆలియా భట్ సినిమా రూపొందింది. వాస్తవికత ప్రతిబింబించేలా సినిమా తెరకెక్కించడం వల్ల ఆస్కార్ లభించే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ భావిస్తోంది. ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' నుంచి పోటీ ఎదురు కావచ్చు.


ఆలియా ఆస్కార్ రేసులో ఉంటారా?
సినిమా సంగతి పక్కన పెడితే... నటిగా ఆలియా భట్ ఆస్కార్ రేసులో ఉంటారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది. వేశ్య పాత్రలో ఆలియా భట్ అద్భుతంగా నటించారని సర్వత్రా ప్రశంసలు వచ్చాయి.


Also Read : ఆదిపురుష్ @ 35000 షోస్


ఆస్కార్ రేసులో ఎన్టీఆర్!
ఉత్తమ నటుడి కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినబడుతోంది. రెండు మూడు హాలీవుడ్ మీడియా సంస్థలు ఆయన గురించి రాశాయి. అయితే... ఇప్పుడే ఎన్టీఆర్‌కు ఆస్కార్ వస్తుందని అనుకోవడం అత్యాశే. ఇయర్ ఎండ్ వస్తే అప్పటి వరకూ విడుదలైన హాలీవుడ్ సినిమాలు, మిగతా వాళ్ళ నటన చూసి ఒక అంచనాకు రావచ్చు.  ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ 'హీరా మండి' వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఆలియా భట్ 'బ్రహ్మాస్త్ర' ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.  


Also Read : తెలుగులో డిజాస్టర్ దిశగా 'లైగర్', హిందీలో బెటర్ - రోజు రోజు విజయ్ దేవరకొండ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?