'లైగర్' (Liger Movie) సినిమాకు ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి గొప్ప స్పందన ఏమీ రాలేదు. తొలి రోజు తొలి ఆట నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. అది ఏమీ  ఫస్ట్ డే కలెక్షన్స్ మీద ప్రభావం చూపించలేదు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్, సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ కారణంగా చెప్పుకోదగ్గ రీతిలో వసూళ్లు వచ్చాయి. అయితే... రెండో రోజుకు ఆ వసూళ్లలో భారీ డ్రాప్ కనిపిస్తోంది. థియేటర్ల దగ్గర జనాలు రావడం లేదని టాక్.


Liger Movie Box Office Collections Prediction Day 2 : 'లైగర్' విడుదల అయిన రోజు ప్రపంచవ్యాప్తంగా 33.12 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే... రెండో రోజు అందులో సగం రావడం కూడా కష్టమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 15 నుంచి 16 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేయవచ్చని అంటున్నాయి. 


తెలుగులో భారీ డిజాస్టర్ దిశగా... 
తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజుకు 'లైగర్' కలెక్షన్లు భారీ డ్రాప్ అయ్యాయి. గుంటూరు జిల్లాలో మొదటి రోజు 83 లక్షల రూపాయల షేర్ వస్తే... రెండో రోజు కేవలం మూడున్నర లక్షల షేర్ వచ్చిందని తెలిసింది. ఆల్ టైమ్ డిజాస్టర్ దిశగా సినిమా వెళుతోందని ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. కృష్ణా జిల్లాలో రెండో రోజు 8 లక్షల రూపాయల షేర్ వచ్చిందట. ఉత్తరాంధ్రలో కాస్త చెప్పుకోదగ్గ విధంగా ఉంది. రూ. 14 లక్షలు వచ్చిందట. మూడో రోజుకు చాలా థియేటర్లలో 'లైగర్'ను తీసి మరో సినిమా వేయడానికి ఎగ్జిబిటర్లు ఆలోచిస్తున్నారట.


తెలుగుతో పోలిస్తే హిందీలో బెటర్?
తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే... హిందీలో 'లైగర్' వసూళ్లు బావున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అక్కడ కూడా సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. డిజాస్టర్ అని తేల్చారు. అయితే... కొన్ని ఏరియాలలో ప్రేక్షకులు థియేటర్లకు వేస్తున్నారు. అదీ రూరల్ ఏరియాలలో! మెట్రో సిటీస్, టౌన్స్‌లో మాత్రం థియేటర్ల దగ్గర క్రౌడ్ తక్కువ ఉందట.


Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్


ప్రచారం బెడిసి కొట్టిందా?'లైగర్' విడుదలకు ముందు చేసిన ప్రచారం బెడిసి కొట్టిందని విజయ్ దేవరకొండ అభిమానులు కొందరు అంటున్నారు. దేశంలో వివిధ నగరాలు తిరగడం... గొప్పగా సినిమా గురించి చెప్పడం వల్ల అంచనాలు పెరిగాయని, దాంతో ప్రేక్షకులు అతిగా ఊహించుకుని థియేటర్లకు వచ్చారని, ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో ఫ్లాప్ టాక్ వచ్చిందని అంటున్నారు.


విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయన రైటింగ్, డైరెక్షన్ మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న 'జన గణ మణ' బిజినెస్ మీద 'లైగర్' బాక్సాఫీస్ రిజల్ట్ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  


Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్