న్‌లైన్‌లో జరుగుతున్న వేధింపులకు చరమగీతం పాడాలని స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా 'సే నో టు ఆన్ లైన్ అబ్యూజ్' ( #SayNOtoOnlineAbuse ) హ్యాష్ ట్యాగ్‌తో వరుస పోస్టులు చేస్తున్నారు. నెటిజన్లు కొందరికి బదులు ఇస్తున్నారు. దీనంతటికీ కారణం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 'లైగర్' సినిమాయే కారణం! అసలు ఈ వివాదం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...


'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ ఉపయోగించిన ఒక పదం మీద అప్పట్లో అనసూయ అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు, ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆ సమస్యను అందరూ మర్చిపోయారు. గతం గతః అనుకుంటే... నిన్న అనసూయ చేసిన ట్వీట్‌తో మరోసారి వివాదం మొదలైంది.


అమ్మ ఉసురు ఊరికే పోదు - అనసూయ 
''అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ... కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా'' అంటూ ఒక ట్వీట్ వేశారు. 'లైగర్' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని అనసూయ ఆ ట్వీట్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల ఫీలింగ్. ఆ తర్వాత మళ్ళీ అనసూయ మీద ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. తనను తిడుతున్న తిట్లు అన్నీ వాళ్ళ హీరోలకు పంపిస్తున్నాని పేర్కొన్నారు. ఇవాళ తనను తిడుతున్న ట్వీట్లను స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నానని, కేసులు పెడతానని హెచ్చరించారు.


ఎంత చెత్త బాబోయ్...
క్లీన్ చేసి చేసి విసుగు వస్తుంది!
'లైగర్' విడుదల రోజున అనసూయ చేసిన ట్వీట్ తర్వాత ఆమెను తిడుతూ ట్వీట్లు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. కొందరు ఆమె కుటుంబ సభ్యులను ఈ వివాదంలోకి లాగుతున్నారు. తన కుటుంబ జోలికి వస్తే కాటకాల వెనక్కి పంపిస్తానని అనసూయ పేర్కొన్నారు. ''ఛీ ఛీ!! అసలు ఎంత చెత్త బాబోయ్... క్లీన్ చేసి చేసి విసుగు వస్తుంది'' అని మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ''నన్ను ఆంటీ అనడంతో పాటు ఏజ్ షేమింగ్ చేయడం, తిట్టడం చేస్తున్న ప్రతి అకౌంట్ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. అలాగే, నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తున్న వాళ్ళవి కూడా! నేను కేసులు పెడతా. సరైన కారణం లేకుండా నాతో పెట్టుకున్నందుకు ఆ తర్వాత మీరు బాధపడతారు. ఇదే నా ఫైనల్ వార్నింగ్'' అని అనసూయ మరో ట్వీట్ చేశారు. 


మూవీలో వాడితే హీరో...
టీవీలో వాడితే ఛీపా?
అనసూయ కేసు పెడతానని హెచ్చరించిన తర్వాత డిస్కషన్ 'జబర్దస్త్' మీదకు మళ్ళింది. ''జబర్దస్త్'లో వేసే డబల్ మీనింగ్ జోకులకు నవ్వుతున్నావ్. దానికి మేడమ్ అని పిలవాలా?'' అని ఒక నెటిజన్ ట్వీట్ చేస్తే... ''మీకు అంత ధైర్యం ఉంటే షో చేసే వాళ్ళ మీద పడండి. తప్పును తప్పు చెప్పే నా మీద పడటం మీ చేతకానితనం. అయినా మూవీలో వాడితే హీరో.... టీవీలో వాడితే ఛీప్'' అని రిప్లై ఇచ్చారు. ఆంటీ అంటే కేసు పెట్టవచ్చని ఆమె తెలిపారు. 


నా వెనుక ఎవరున్నారు?
అనసూయ వ్యాఖ్యల వెనుక ఎవరో ఉన్నారని, కావాలని సమస్యను పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నాని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. అందుకు ''నా వెనకాల ఎవరున్నారని నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను'' అని అనసూయ పేర్కొన్నారు. అంతే కాదు... అబ్యూజ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్న ప్రతి ఒక్కరి ట్వీట్‌ను కోట్ చేస్తున్నారు.



Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?



సినిమా లేదంటే టీవీ షోలో అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ అనుమతితో ఫిక్షనల్ కంటెంట్ క్రియేట్ చేయడంలో... సినిమా లేదంటే టీవీ బయట ఒకరిని కించపరచడం... వేధింపులకు గురి చేయడం, తిట్టడంలో మీకు నిజంగా తేడా తెలియదా? అని అనసూయ సూటిగా ప్రశ్నించారు. ఆమెకు మద్దతుగా కొంత మంది నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. 


Also Read : 'కళాపురం' రివ్యూ : అందరూ కళాకారులే - సినిమా ఎలా ఉందంటే?