అర్జున్ రెడ్డి సినిమాతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. సందీప్ వంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై గురువారానికి (ఆగసు 25) ఐదేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సినిమాలో డిలీటెడ్ సీన్ ని విడుదల చేశారు. కచ్చితంగా రౌడీ బాయ్ అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా 'లైగర్' రిలీజ్ రోజే ఈ డిలీటెడ్ సీన్ కూడా రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 2.53 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రాహుల్ రామకృష్ణ, విజయ్ మధ్య సంభాషణలు చూపించారు. తన కూతురు మీద తండ్రి చూపించే ప్రేమ గురించి ఇందులో రాహుల్ రామకృష్ణ చక్కగా చెప్పారు.


చాలా రోజుల తర్వాత ప్రీతిని కలిసేందుకు వెళ్ళినప్పుడు అర్జున్ ఆనందంలో ఆమెను ముద్దు పెట్టుకోవడం, అది చూసి ప్రీతి తండ్రి గొడవ పడటం గుర్తుచేసుకుంటూ విజయ్ మాట్లాడటాన్ని ఇందులో చూపించారు. “ఆ రోజు నేను ప్రీతిని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాను. కానీ అది తన తండ్రి తప్పుగా అర్థం చేసుకుని నాతో గొడవ పెట్టుకున్నారు” అని విజయ్ చెప్తాడు. “ప్రీతి అంటే నీకు చందమామ, చుక్కలంత లవ్ అంటున్నావ్. కానీ వాళ్ళ నాయనకి మిల్కీవే గ్యాలక్సీ కంటే తక్కువ ప్రేమ లేదురా. వాడు నా ప్రేమకి అడ్డం పడుతున్నాడు అని అనుకున్నావా? వాడు నీ ప్రేమకి అడ్డం పడబట్టే అతనకు కూతురు మీద ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది. ఇందులో నీ కోపం ఒక్కటే నీకు శత్రువు” అని రాహుల్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.  


రొమాంటిక్, బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ సినిమాగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. విజయ్ క్రేజ్ ని అమాంతం పెంచేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రేంజ్ లో హిట్ మళ్ళీ విజయ్ కి దక్కలేదు. ఈ సినిమాలో విజయ్ సరసన షాలిని పాండే నటించింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఓ మెడికో తన లవ్ ని ఎలా దూరం చేసుకున్నాడు, మళ్ళీ ఎలా తిరిగి దక్కించుకున్నాడు అనేది ఇందులో చూపించారు. ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం విడుదల చేసిన ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. అభ్యంతరకర సన్నివేశాలు, బూతులు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో అప్పట్లో ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా కూడా నిలిచింది.


ప్రస్తుతం విజయ్ నటించిన పాన్ ఇండియా సినిమా లైగర్ కూడా అర్జున్ రెడ్డి విడుదలైన తేదీనే థియేటర్స్ లోకి వచ్చింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా అనన్య పాండే నటించింది. కానీ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. నెగటివ్ రివ్యూలు ఎక్కువగా వచ్చాయి.


Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?


Also Read : హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ఎపిసోడ్ రివ్యూ: గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్థాయిని అందుకుందా?