'ఏజెంట్' విడుదలకు ముందు హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ప్రతి రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈవెంట్ లేదంటే టీవీ ప్రోగ్రామ్ లేదంటే సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ... ఏదో ఒక రూపంలో! సినిమా విడుదలైన రోజు శ్రీ రాములు థియేటర్లో ప్రేక్షకులతో కలిసి మార్నింగ్ షో చూశారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ రోజు ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కొంత మందికి కనిపించారు.
దుబాయ్ వెళ్లిన అఖిల్!
అఖిల్ అక్కినేని దుబాయ్ వెళ్లినట్లు తెలిసింది. 'ఏజెంట్' ఫ్లాప్ నుంచి కోలుకోవడం కోసమే ఆయన దుబాయ్ వెళ్లారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. ఇది షార్ట్ ట్రిప్ అని, త్వరలో ఆయన మళ్ళీ ఇండియా వస్తారని సమాచారం. అఖిల్ వచ్చిన తర్వాత యువి క్రియేషన్స్ నిర్మాణంలో అనిల్ కుమార్ దర్శకత్వంలో ఆయన చేయనున్న సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.
మే 19న ఓటీటీలో 'ఏజెంట్'
Agent Movie OTT Release Date : 'ఏజెంట్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నెల 19న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. సో... మరో రెండు వారాలు ఆగితే ఓటీటీలో సినిమాను చూసేయొచ్చు. అదీ సంగతి!
Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్
థియేటర్లలో ఏప్రిల్ 28న 'ఏజెంట్' విడుదలైంది. అంటే... మూడు వారాలకు ఓటీటీ స్క్రీన్ మీద విడుదలకు రెడీ అయ్యింది. తెలుగులో కొన్ని చిన్న సినిమాలు ఈ విధంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. థియేటర్లలోకి వచ్చిన వారమే వచ్చిన సినిమాలు ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్ అయిన రెండు మూడు వారాలకు వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే... భారీ తారాగణం, పేరున్న దర్శక - నిర్మాతలు చేసిన సినిమా మూడు వారాలకు ఓటీటీ బాట పట్టడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
'ఏజెంట్' సినిమా (Agent Movie)లో మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. డినో మోరియా విలన్ రోల్ చేశారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు.
Also Read : ప్రియాంక చోప్రా వేసుకున్న నెక్లెస్ అమ్మితే పాన్ ఇండియా సినిమా తీయొచ్చు!
నిర్మాతే ఫ్లాప్ అని ట్వీట్ చేశాక...
భారీ అంచనాల మధ్య 'ఏజెంట్' థియేటర్లలోకి వచ్చింది. అయితే, మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది. దాంతో రెండో రోజు వసూళ్ళ మీద తీవ్ర ప్రభావం చూపించింది. మొదటి రోజు సినిమాకు నాలుగు కోట్ల షేర్ వస్తే... రెండో రోజు అది కోటిన్నరకు పడింది. మూడు రోజు లక్షల్లో వచ్చింది. నాలుగు రోజు అయితే కేవలం 17 లక్షల రూపాయల షేర్ మాత్రమే రాబట్టింది. మంగళవారం అది కూడా రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నిర్మాత అనిల్ సుంకర సైతం తమ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకొన్నారు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా స్టార్ట్ చేయడం తమ తప్పేనని ఆయన అంగీకరించారు. తమకు 'ఏజెంట్' కాస్ట్లీ మిస్టేక్ అని అనిల్ సుంకర ట్వీట్ చేశారు. అది కూడా వసూళ్ల మీద చాలా ప్రభావం చూపించిందని, నిర్మాతే ఫ్లాప్ అని చెప్పాక థియేటర్లకు ఎవరు వస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.