అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.


సినిమాపై అంచనాలు పెంచిన ట్రైలర్


తాజాగా విడుదలైన ‘ఏజెంట్’ ట్రైలర్‌ను సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో పూర్తిగా డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. సరికొత్త హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీతో వైల్డ్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. 'ది మోస్ట్ నోటోరియస్, మోస్ట్ రూత్ లెస్ పేట్రియాట్' అనే డైలాగ్‌తో వదిలిన టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అఖిల్ క్యారెక్టర్ ఎంత వైల్డ్‌గా ఉండబోతుందనేది చెప్పేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మొత్తం మరింత ఉత్కంఠభరితంగా, గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. అంతేకాదు, అఖిల్ క్యారెక్టర్‌ కూడా ఆసక్తిగా, ఎనర్జిటిక్‌గా ఉంది.  



చిరంజీవి, బాలయ్యను వెనక్కి నెట్టిన అఖిల్!


ఇక ‘ఏజెంట్’ ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. వ్యూస్ విషయంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ అయిన  ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలను వెనక్కి నెట్టింది. ‘ఏజెంట్’ ట్రైలర్‌కి 24 గంటల్లో 12M (12 మిలియన్) కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు 11.5M+ వ్యూస్ రాగా, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాకు 8M+ వ్యూస్ వచ్చాయి.   


సుమారు రెండేళ్లుగా చిత్రీకరిస్తున్న ఈ మూవీ గతేడాది ఆగస్టు 12నే విడుదల కావల్సి ఉండేది. కానీ, అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 28న మూవీని విడుదల చేస్తున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ రెడ్డికి చెందిన స‌రెండ‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ  రాగూల్ హెరియన్ ధారుమాన్ చేస్తున్నారు. ఎడిటర్‌ గా నవీన్ నూలీ, ఆర్ట్ డైరెక్టర్‌ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. సహ నిర్మాతలుగా అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి ఉన్నారు. 


అఖిల్ కు ‘ఏజెంట్’ మైల్ స్టోన్ కానుందా?


'ఏజెంట్' విడుదల తర్వాత అఖిల్ అక్కినేని సూపర్ స్టార్ అవుతాడని ఈ సినిమా దర్శక - నిర్మాతలు సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో 'సూపర్ స్టార్ ఇన్ మేకింగ్' అంటూ అనిల్ సుంకర స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తమ ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉన్నా... తనకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమని అఖిల్ కూడా స్పష్టం చేశారు. సో... భవిష్యత్తులో ఆయన యాక్షన్ సినిమాలు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. 


Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?