మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ... అలాగే దర్శకుడు సుకుమార్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ, సన్నిహితుల మీద బుధవారం ఐటీ రైడ్స్ జరిగాయి. ఈ విషయం తెలుగు చిత్రసీమకు చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఎందుకంటే... మైత్రీ సంస్థపై తొలి రైడ్ ఇది.


కొత్త సినిమాలు విడుదలైనప్పుడు, మరీ ముఖ్యంగా సినిమాలకు కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయని నిర్మాణ సంస్థలు స్వయంగా ప్రకటించినప్పుడు ఐటీ రైడ్స్ జరగడం, నిర్మాతలను లెక్కలు అడగడం సాధారణంగా జరిగే విషయమే. మైత్రీ మూవీ మేకర్స్, ఆయనకు అనుబంధంగా ఉన్న వ్యక్తుల మీద తొలిసారి ఐటీ రైడ్స్ జరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ రైడ్స్ ఎఫెక్ట్ ఇప్పుడు 'పుష్ప 2' సినిమాపై పడిందని సమాచారం. 


'పుష్ప 2' షూటింగుకు బ్రేకులు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'పుష్ప 2' (Pushpa 2 Movie). పాన్ ఇండియా హిట్ 'పుష్ప'కు సీక్వెల్ ఇది. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్, ఫారిన్ ఫైటర్స్, సినిమాలో కీలక తారాగణంతో కొందరి మీద ఫైట్స్ తీస్తున్నారు.  


నిర్మాతలతో పాటు దర్శకుడు సుకుమార్ మీద కూడా రైడ్స్ జరుగుతుండటంతో 'పుష్ప 2' చిత్రీకరణను అర్థాంతరంగా ఆపేయాల్సి వచ్చిందని తెలిసింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రెండో రోజు కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. దీని వల్ల నిర్మాణ సంస్థ మీద భారం గట్టిగా పడుతుందని తెలిసింది. దీన్నుంచి కోలుకోవడానికి కొంత టైమ్ పడుతుందని ఇండస్ట్రీ వర్గాల కథనం.


Also Read : నరేష్, పవిత్రల 'పెళ్లి' టీజర్ - 24 గంటలు లోపే


అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప 2'లో ఆయన లుక్ విడుదల చేశారు. అది నెట్టింట వైరల్ అయ్యింది. చీర కట్టి, ముక్కు పుడక పెట్టి, బొట్టుతో బన్నీ కొత్తగా కనిపించారు. తిరుపతిలో గంగమ్మ జాతరలో పురుషులు ఏ విధంగా పాల్గొంటారో, ఆ విధంగా కనిపించి ఔరా అనిపించారు. ఆ లుక్ రికార్డులు క్రియేట్ చేసింది. 


సోషల్ మీడియాలో లైకులే లైకులు!
అల్లు అర్జున్ 'పుష్ప 2' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ట్విట్టర్‌లో 207కె, ఫేస్‌బుక్‌లో 5 మిలియన్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 850కె లైక్స్ వచ్చాయి. ఎక్కువ మంది లైక్ చేసిన లుక్ కింద 'పుష్ప 2' రికార్డు క్రియేట్ చేసింది. 






యూట్యూబ్‌లో 'వేర్ ఈజ్ పుష్ప' టీజర్ అయితే 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమా టీజర్లలో 'ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్' మూడో స్థానంలో నిలిచింది. దీనికి 22.52 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హిందీ వెర్షన్ టీజర్ 30 మిలియన్ వ్యూస్ కు చేరువలో ఉంది. యూట్యూబ్‌లో 24 గంటల్లో ఎక్కువ మంది లైక్ చేసిన టీజర్లలో రెండో స్థానంలో ఉంది. 793కె లైక్స్ వచ్చాయి. అదీ సంగతి! తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజ్ శేషాచలం అడవుల్లో ఉన్నట్టు ఆ టీజర్ లో చెప్పారు. అక్కడ ఆయన ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. 


Also Read 'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి