గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ సినిమాలో దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2'. సింహ లెజెండ్ అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర తర్వాత వాళ్ళిద్దరూ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా కోసం సరైనోడిని రంగంలోకి దించారు బోయపాటి.


'అఖండ 2'లో సరైనోడు విలన్!
యంగ్ హీరో అండ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అది పినిశెట్టి గుర్తు ఉన్నాడా? ఈ మధ్య కాలంలో తెలుగులో అతడి సందడి తగ్గింది. తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలకృష్ణ 'అఖండ 2'లో ఆయన ఒక కీలక పాత్ర చేస్తున్నారని ఈ రోజు అనౌన్స్ చేశారు.


బోయపాటి శ్రీనుతో ఆది పినిశెట్టికి మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు ఒక సినిమా చేశారు. 'సరైనోడు' సినిమాలో ఆది పినిశెట్టి చేత ఎక్స్ట్రార్డినరీ విలనిజం చేయించారు బోయపాటి. ఇప్పుడు మరోసారి అతడిని తన సినిమాలోకి తీసుకున్నారు. ఈ సారి ఎటువంటి విలనిజం చూపిస్తారో? తను ప్రతి సినిమాలో విలన్ క్యారెక్టర్స్ డిజైన్ చేయడం మీద బోయపాటి ప్రత్యేకంగా వర్క్ చేస్తారు. ఆయన సినిమాల్లో రెగ్యులర్ కైండ్ ఆఫ్ విలన్స్ ఉండరు. మరి ఈసారి ఆది పినిశెట్టి కి ఎటువంటి క్యారెక్టర్ వచ్చిందో? లుక్ అయితే చాలా కొత్తగా ఉండబోతుందని సినిమా యూనిట్ తెలిపింది.






అన్నపూర్ణలో ఫైట్ షూటింగ్!
'అఖండ 2' షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో జరుగుతోంది. బాలకృష్ణ, ఆది పినిశెట్టి మీద ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సేన్స్ చాలా బాగుంటాయని యూనిట్ అంటోంది. ఇంటెన్స్ యాక్షన్ అండ్ గ్రిప్పింగ్ మూమెంట్స్ తో బోయపాటి ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారట. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ స్పెషల్ సెట్ రూపొందించింది.


Also Read: 'మాస్ జాతర' తర్వాత రవితేజ సినిమా ఫిక్స్... సమ్మర్‌లో సెట్స్‌ మీదకు, దర్శకుడు ఎవరంటే?



బాలకృష్ణ సరసన సంయుక్త!
'అఖండ' సినిమాలో బాలకృష్ణకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ కనిపించారు. ఆ తరువాత ఇటీవల వచ్చిన 'డాకు మహారాజ్' సినిమాలోనూ సందడి చేశారు. 'అఖండ 2'లో ఆవిడ క్యారెక్టర్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ రోల్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. మిగతా ఆర్టిస్టుల వివరాలు త్వరలో చేయనున్నారు. 


దసరా కానుకగా థియేటర్లలోకి!
Akhanda 2 Release Date: 'అఖండ 2 తాండవం' విడుదల తేదీని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది విజయ దశమి సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి సినిమాలు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో కూడా సినిమాను రిలీజ్ చేయనున్నారు. బాలకృష్ణ రెండో కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.


Also Readఇండియాలో కాస్ట్లీయస్ట్ విలన్... రెమ్యూనరేషన్‌లో 'కల్కి 2898 ఏడీ' కమల్, 'యానిమల్‌' బాబీని బీట్ చేసిన హీరోయిన్