Rajinikanth Emotional: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. తన కూతురు ఐశ్వర్య చెప్పిన ఎమోషనల్‌ మాటలకు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్‌ సలామ్‌' సినిమా ఆడియో రిలీజ్‌ఫంక్షన్‌ చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఆ ఫంక్షన్‌లో ఆమె మాట్లాడారు. రజనీకాంత్‌ని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్‌ చేయడంపై ఆమె స్పందించారు. "మా నాన్న సంఘీ కాదు. ఆయన అలాంటి వాడైతే ఈ సినిమా చేసేవాళ్లు కాదు’’ అంటూ ఆమె అన్న మాటలకు రజనీకాంత్‌ కంటతడి పెట్టుకున్నారు.

  


మేమూ మనుషులమే.. 


రజనీకాంత్‌పై ఈ మధ్య కొంతమంది రాజకీయపరంగా ట్రోల్స్‌ చేసిన విషయం తెలిసిందే ఆ విషయంపై స్పందించారు ఐశ్వర్య.  "నేను సహజంగా సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటాను. నా టీమ్‌ నాకు అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే నాన్నను కొంతమంది సంఘీ అని అనడం చూశాను. నిజానికి ఆ పదానికి నాకు అర్థం తెలీదు. ఏంటా అని వేరే వాళ్లను అడిగి.. "ఒక పార్టీకి చెందిన వ్యక్తిని సంఘీ అంటారు'' అని వాళ్ల చెప్పారు. అప్పుడు చాలా బాధేసింది. మేమూ మనుషులమే కదా. మాకు ఫీలింగ్స్‌ ఉంటాయి కదా. మా నాన్న నిజంగా ఒక సంఘీ అయి ఉంటే అసలు 'లాల్‌సలామ్‌' సినిమా చేసుండేవాళ్లే కాదు'' అంటూ ఐశ్వర్య అన్నారు. దీంతో ఈ మాటలు విన్న రజనీకాంత్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 


ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చాలామంది ప్రొడ్యూసర్స్‌ సినిమా తీసేందుకు ముందుకు రాలేదని ఆమె అన్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్‌లో నటించమని రజనీకాంత్‌ని అడగలేదని, ఆయనే స్వయంగా కథ విని "నేను మొయిదీన్‌ భాయ్‌ పాత్రలో నటిస్తాను" అని ముందుకు వచ్చారని చెప్పారు సౌందర్య. ఇంతపెద్ద నటుడిని ఇంట్లో పెట్టుకుని ఆయన్ను కనీసం నేను అడగలేదు ఏంటి అని తర్వాత చాలా రిగ్రెట్‌ ఫీల్‌ అయ్యాను అని చెప్పారు ఆమె. ఇక సెంజీ, తిరువన్నామళై, పాండీచ్చేరిలో షూటింగ్‌ జరిగేటప్పుడు రజనీకాంత్‌ని అక్కడి ప్రజలు కొడుకులా చూసుకున్నారని వాళ్లకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు ఆమె.


ఆ మాటలు బాధించాయి : రజనీకాంత్‌


ఈ ఈవెంట్‌లో మాట్లాడిన రజనీకాంత్‌ కూడా తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించారు. 'అర్థమైందా రాజా' అంటూ జైలర్‌ ఈవెంట్‌లో తాను చేసిన కామెంట్స్‌ను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని బాధపడ్డారు రజనీకాంత్‌. విజయ్‌పై తాను పరోక్షంగా మాటల దాడి చేశారని అనుకున్నారని, అవి తనను ఎంతో బాధించాయి అని ఎమోషనల్‌ అయ్యారు. విజయ్‌ తన కళ్లముందు చాలా కష్టపడి ఎదిగాడని, ఎవరితోనూ ఎవరికి పోటీ లేదని అన్నారు రజనీ. తమని ఎవ్వరితో పోల్చి చూడొద్దని చెప్పారు. ఇక ఈ సినమా కచ్చితంగా సూపర్‌హిట్‌ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 






'లాల్‌సలామ్‌' చిత్రానికి ఆయన ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణు విశాల్‌ హీరోగా నటించారు. రజనీకాంత్‌ ఈ సినిమాలో గెస్ట్‌రోల్‌ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాని పోస్ట్‌డ్రామాగా తెరకెక్కించారు. విక్రాంత్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. ఫిబ్రవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: అందుకే దూరంగా ఉంటున్నాం - సూర్యతో విడాకులపై స్పందించిన జ్యోతిక