Suriya Jyothika Divorce: ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో చాలామంది కపుల్స్‌ వాళ్ల కో యాక్టర్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్నవాళ్లలో కొంతమంది కొన్ని కొన్ని కారణాల వల్ల విడిపోతే.. ఇంకొంతమంది మాత్రం క్యూట్‌ పెయిర్స్‌లా అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. ఇక అలాంటి వాళ్లలో ఒక క్యూట్‌ కపుల్‌ సూర్య, జ్యోతిక. ఇద్దరు కలిసి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్లు చేశారు. ఇక ఆ టైంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నారు. ఇక వాళ్ల ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.


అయితే, ఈ మధ్య ఈ జంట ముంబైకి షిఫ్ట్ అయ్యారు. కొన్నాళ్లు అక్కడే ఉంటున్నట్లు జ్యోతిక చెప్పింది. దీంతో ఒక రూమర్‌ బాగా బయటికి వచ్చింది. జ్యోతిక, సూర్య విడాకులు తీసుకుంటున్నారని, అందుకే జ్యోతిక పిల్లలతో ముంబైలో ఉంటోందనే వార్తలు గట్టిగా వినిపించాయి. నిజానికి గత కొన్ని నెలలుగా దీనిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తుండగా అటు సూర్య, ఇటు జ్యోతిక ఎవ్వరూ స్పందించకపోవడంతో అది నిజమే అనుకుంటున్నారు. అయితే, వాళ్ల ఊహలకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది జ్యోతిక. విడాకులపై మొదటిసారి స్పందించింది.


కెరీర్‌ కోసమే ఇలా..


సూర్య, జ్యోతిక పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక తన సినిమా కెరీర్‌ని స్టాప్‌ చేశారు. ఇక ఈ మధ్యే జ్యోతిక సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. దీంతో జ్యోతికకి ఆఫర్స్‌ చాలానే వచ్చాయి. దాంట్లో భాగంగానే ఆమె ఇప్పుడు రెండు బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ కూడా చేస్తుందట. ఆ షూటింగ్స్‌కి వెళ్లడం, పిల్లల చదువుల కోసం వాళ్లు ముంబైకి మకాం మార్చారట. షూటింగ్స్‌, పిల్లల చదువులకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ముంబై వచ్చామని, ఆ తర్వాత తిరిగి చెన్నై వెళ్లిపోతామని తెలిపింది. ఈ రీజన్స్ వల్లే ఇక్కడికి వచ్చాం తప్పా, మరేది లేదు అంటూ తన విడాకులపై స్పందించింది జ్యోతిక. 


సూర్య, జ్యోతిక వీళ్లిద్దరికి అటు కోలివుడ్‌తో పాటుగా ఇటు టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. వీళ్లకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమాలు ఎవర్‌గ్రీన్‌ అనే చెప్పాలి. ఇక వీళ్లని క్యూట్‌ కపుల్‌గా చెప్తుంటారు. ఇక వాళ్లిద్దరికి కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇదే విషయం చాలా ఇంటర్వ్యూల్లో కూడా పంచుకున్నారు. ఇక వాళ్లిద్దరు కలిసి బయటికి వచ్చినప్పుడు కూడా అలానే నడుచుకుంటారు కూడా. దీంతో అలాంటివాళ్లు విడాకులు తీసుకోవడం ఏంటని ఫ్యాన్స్‌ తెగ ఆందోళనకు గురయ్యారు. కానీ, ఇప్పుడు జ్యోతిక ఇచ్చిన క్లారిటీతో ఊపిరి పీల్చుకున్నారు అనే చెప్పాలి.


సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో జ్యోతిక వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆమె నటించిన 'కాథల్‌' అనే సినిమా ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డిఫరెంట్‌ స్టోరీలైన్‌తో వచ్చింది ఈ సినిమా. ఇక ఆమె నటించిన 'సైథాన్‌' టీజర్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజ్‌ కాగా.. అది కూడా మంచి టాక్‌ అందుకుంది.


Also Read : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - రామ్ చరణ్ బర్త్ డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన