'RC16' Team Surprise To Mega Fans On Ramcharan's Birthday : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతూ వస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటివరకు టైటిల్ అనౌన్స్మెంట్ తప్పితే మరో అప్డేట్ లేదు. దాంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కంటే చరణ్ తర్వాత చేయబోయే 'RC16' ప్రాజెక్ట్ పైనే సారిస్తున్నారు అభిమానులు. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


'RC16' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ఓ స్పెషల్ డేట్ ని ఫిక్స్ చేశారట మూవీ టీం. ఆ స్పెషల్ డేట్ మరేదో కాదు.. రామ్ చరణ్ బర్త్ డే రోజు 'RC16' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే కావడంతో ఆ రోజు ఫ్యాన్స్ కి 'RC 16' ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారట. ఇక ఈ న్యూస్ తో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గత ఏడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 'RC16' ప్రాజెక్ట్ ని ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇక ఈ ఏడాది అదే చరణ్ బర్త్ డే రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోంది.


మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. కొద్దిరోజుల షూటింగ్ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారంటే చరణ్ బర్త్ డే కి 'RC16' నుంచి చిన్న వీడియో గ్లింప్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మునిపెన్నోడు కనిపించని డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు చెబుతున్నారు. రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు పాత్రను మించేలా RC16 లో చరణ్ రోల్ ని డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సాయి పల్లవి నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి.


అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ సేతుపతి తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ సైతం ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఇక రాంచరణ్ 'గేమ్ చేంజర్' విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుక విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అవడంతో గేమ్ 'చేంజర్' రిలీజ్ పై ఇంకా క్లారిటీ లేదు.


Also Read : అఫీషియల్... థియేటర్లలోకి 'టిల్లు స్క్వేర్' వచ్చేది ఆ రోజే