Tillu Square new release date: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'టిల్లు స్క్వేర్'. సూపర్ డూపర్ హిట్ 'డీజే టిల్లు'కు ఇది సీక్వెల్. ఈ సినిమా విడుదల తేదీని ఈ రోజు వెల్లడించారు.
మార్చి 29న థియేటర్లలోకి టిల్లు
Tillu Square release on March 29th: 'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. సో... టిల్లుగా మరోసారి సిద్ధు జొన్నలగడ్డ, ఆయనకు జోడీగా అనుపమా పరమేశ్వరన్ సందడి ఈ రోజు నుంచి థియేటర్లలో మొదలు కానుంది.
నిజానికి, 'టిల్లు స్క్వేర్' సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదల కావాలి. అయితే సంక్రాంతి బరిలో రద్దీ తగ్గించడానికి మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' విడుదల వాయిదా వేశారు. ఆ చిత్రానికి ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఛాంబర్ పెద్దలు హామీ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన 'గుంటూరు కారం' సంక్రాంతికి విడుదల అయ్యింది. 'ఈగల్' వాయిదా వేసినందుకు తమ 'టిల్లు స్క్వేర్' సినిమాను వాయిదా వేస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు. చెప్పినట్లు వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేశారు.
ఉగాది పండక్కి పది రోజుల ముందు!
ఏప్రిల్ 9న ఉగాది. సరిగ్గా ఆ పండక్కి పది రోజుల ముందు 'టిల్లు స్క్వేర్' విడుదల అవుతోంది. సూపర్ హిట్ టాక్ వస్తే... ఉగాది వరకు థియేటర్లలో మంచి వసూళ్లు వస్తాయి. ప్రస్తుతానికి ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ఒక్కటే విడుదలకు రెడీ అవుతోంది. 'దేవర' వాయిదా పడటంతో థియేటర్లలో ఈ రెండు సినిమాలకు పెద్ద పోటీ ఉండకపోవచ్చు.
Also Read: మెగా ప్రిన్సెస్ క్లీంకార అమ్మమ్మ ఇంట్లో ఒకరు, నానమ్మ ఇంట్లో మరొకరు - ఊహ తెలిసే వయసుకు ఇంకెన్నో?
'టిల్లు స్క్వేర్' చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య సహ నిర్మాత. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాలపై 'టిల్లు స్క్వేర్' సినిమా తెరకెక్కుతోంది. 'డీజే టిల్లు' తరహాలో ఈ సినిమా కూడా కల్ట్ స్టేటస్ అందుకుంటుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.
ఆల్రెడీ విడుదలైన 'టిల్లు స్క్వేర్' పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 'డీజే టిల్లు' సినిమాలో 'టిల్లన్న డీజే కొడితే...' పాట సూపర్ హిట్ అయ్యింది. దానిని రామ్ మిరియాల స్వర పరచడంతో పాటు ఆలపించారు. 'టిల్లు స్క్వేర్'లో 'టిక్కెట్టే కొనకుండా...' పాట కూడా ఆయన సంగీతం, గాత్రంలో రూపొందింది. దీంతో పాటు 'రాధికా రాధికా...' కూడా చార్ట్ బస్టర్ అయ్యింది.
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్, కూర్పు : 'జాతీయ పురస్కార గ్రహీత' నవీన్ నూలి, సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, కళ: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, దర్శకుడు : మల్లిక్ రామ్.