యంగ్ హీరో కార్తీక్ రాజు (Karthik Raju) నటించిన తాజా సినిమా 'అథర్వ' (Atharva Movie). ఆయనకు జోడీగా సిమ్రాన్ చౌదరి హీరోయిన్ (Simran Choudhary) యాక్ట్ చేశారు. ఇందులో మరో కథానాయిక ఐరా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైందీ సినిమా. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ 'అథర్వ'
Atharva Movie OTT Platform: క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన 'అథర్వ'కు థియేటర్లలో చెప్పుకోదగ్గ రీతిలో మంచి స్పందన లభించింది. విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇప్పటి వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసిన ప్రేక్షకులకు 'అథర్వ'లో క్రైమ్ జరిగిన చోట క్లూస్ టీం పడుతున్న కష్టాలు కొత్తగా అనిపించాయి.
Also Read: పద్మ విభూషణ్‌కు ముందు చిరంజీవికి వచ్చిన అవార్డులు, లభించిన సత్కారాలు తెలుసా?
థియేటర్లలో డిసెంబర్ 1న విడుదలైన 'అథర్వ' కొన్ని రోజుల క్రితం ఈటీవీకి చెందిన ఓటీటీ వేదిక 'ఈ విన్'లో విడుదలైంది. మంచి వీక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ విడుదల అయ్యింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది.
'అథర్వ' సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఇదొక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఓ నేరం జరిగిన తర్వాత దోషులను పట్టుకోవడంలో శిక్షించడంలో ఫోరెన్సిక్, క్లూస్ టీం పాత్ర ఏమిటి? అనే పాయింట్ తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది.
Also Read: మెగా ప్రిన్సెస్ క్లీంకార అమ్మమ్మ ఇంట్లో ఒకరు, నానమ్మ ఇంట్లో మరొకరు - ఊహ తెలిసే వయసుకు ఇంకెన్నో?
'అథర్వ' సినిమా కథ ఏమిటంటే?
దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు)కు చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనేది కోరిక. ట్రై చేసినా ఉద్యోగం రాదు. ఓ కానిస్టేబుల్ ఇచ్చిన సలహాతో క్లూస్ టీమ్ సెలక్షన్స్‌కు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవుతాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత కాలేజీలో తాను దూరం నుంచి చూస్తూ లవ్ చేసిన జూనియర్ నిత్య పరిచయం అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి క్రైమ్ రిపోర్టర్. నిత్య ద్వారా హీరోయిన్ జోష్ని (ఐరా) పరిచయం అవుతుంది. ఒక రోజు ఆమె ఇంటికి వెళితే... ఐరా ఆమె బాయ్‌ఫ్రెండ్ శివ చనిపోవడం చూసి కర్ణ, నిత్య షాక్ అవుతారు. జోష్నిని శివ చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తెలుతుంది. కేసు క్లోజ్ అవుతుంది. అయితే... జోష్ని, శివకు సన్నిహితురాలైన నిత్య చెప్పిన కొన్ని విషయాలు విన్న కర్ణ... జోష్నిని చంపింది శివ కాదని, వాళ్లిద్దర్నీ మరొకరు చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తాడు. అతడి అనుమానం నిజమైందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.