నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'రాబిన్ హుడ్' టైటిల్ ఖరారు చేశారు. 'భీష్మ' విజయం తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. నితిన్ క్యారెక్టర్ మరింత రివీల్ చేయడంతో పాటు ఆయనతో చెప్పించిన డైలాగులు సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఉన్నాయి.


డబ్బు చాలా చెడ్డది... దోచుకున్న నితిన్!
'రాబిన్ హుడ్' టైటిల్ అనౌన్స్ చేయక ముందు... సినిమాలో నితిన్ కాన్ మ్యాన్ (మోసగాడు) రోల్ చేస్తున్నారని చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పుడు క్యారెక్టర్ గురించి మరింత డిటైల్డ్‌గా వీడియో గ్లింప్స్‌లో వివరించారు. సినిమా టైటిల్‌కు తగ్గట్టు డబ్బునోళ్ల దగ్గర దోచుకునే యువకుడిగా నితిన్ పాత్రను చూపించారు. 


''డబ్బు చాలా చెడ్డది...
రూపాయి రూపాయి నువ్ ఏం చేస్తావ్ అంటే?
'అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెడతాను' అంటాది.
అన్నట్టే చేసింది.
దేశం అంత కుటుంబం నాది… ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు, ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్క చెల్లెళ్ళు. అవసరం కొద్దీ వాళ్ళ జేబుల్లో చేతులు పెడితే? ఫామిలీ మెంబెర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు.
అయినా నేను హర్ట్ అవ్వలేదు. ఎందుకంటే... వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం నా హక్కు! మై బేసిక్ రైట్! బికాజ్... ఇండియా ఈజ్ మై కంట్రీ! ఆల్ ఇండియన్స్ అర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్!'' అని నితిన్ తనను తాను పరిచయం చేసుకున్నారు. అంటే... తన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అదీ సంగతి! డబ్బు, నగలు దోచుకోవడానికి వెళ్లేటప్పుడు నితిన్ శాంటా క్లాజ్ గెటప్ వేసుకోవడం భలే ఉందని నెటిజనులు చెబుతున్నారు.


Also Readచిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్న హీరోలు ఎవరు... ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరెవరికి ఆ అవార్డు వచ్చిందో తెలుసా?






దోచుకున్న డబ్బు ఏం చేశారు?
ప్రస్తుతానికి విడుదల చేసింది వీడియో గ్లింప్స్ మాత్రమే కాబట్టి... క్యారెక్టర్ వరకు ఇంట్రడ్యూస్ చేశారు. మరి, ఆ దోచుకున్న డబ్బును హీరో ఏం చేశాడు? అనేది ఇప్పుడు సస్పెన్స్. 'ఛలో', 'భీష్మ'... వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లోనూ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు నచ్చింది. ఈసారి వినోదంతో పాటు ఓ సందేశంతో కూడిన కథను వెంకీ కుడుముల చెప్పబోతున్నట్టు అర్థం అవుతోంది. ఈ క్యారెక్టర్ కోసం నితిన్ స్టైలిష్‌గా మేకోవర్ అయ్యారు.


Also Readపద్మ విభూషణ్‌కు ముందు చిరంజీవికి వచ్చిన అవార్డులు, లభించిన సత్కారాలు తెలుసా?



'రాబిన్ హుడ్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే... ఇంకా ఈ సినిమాలో కథానాయిక పేరును చెప్పలేదు. తొలుత రష్మికను ఎంపిక చేసినా... డేట్స్ అడ్జస్ట్ కాక ఆమె వెళ్లిపోయారు. రష్మిక బదులు శ్రీ లీలను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇంకా ఈ సినిమాకు సీఈవో: చెర్రీ, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్.