సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రత్యేక పాత్రలో కనిపించనున్న సినిమా 'లాల్ సలాం' (Lal Salaam Movie). దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వం వహిస్తున్నారు. చెన్నైలో మంగళవారం సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... సినిమా నేపథ్యం ఏమిటనేది కూడా అర్థం అవుతుంది.
క్రికెట్ & గొడవలు
క్రికెట్ నేపథ్యంలో 'లాల్ సలాం' రూపొందుతోందని సినిమా అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన పోస్టర్ చూస్తే తెలుస్తుంది. అయితే... క్రికెట్ ఒక్కటే కాదని, ఈ సినిమాలో క్రికెట్ నేపథ్యంలో జరిగిన అల్లర్లు కూడా ఉంటాయని లేటెస్ట్ పోస్టర్ చూస్తే తెలుస్తుంది.
భారతీయులకు వినోదం అంటే ముందుగా గుర్తు వచ్చేది రెండే! ఒకటి... సినిమా, రెండు... క్రికెట్! సినిమాలో క్రికెట్ అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా! ఆ రెండిటికి తోడు గొడవలు అంటే... ఐశ్వర్య రజనీకాంత్ ఏం తీస్తున్నారో అనే ఆసక్తి తమిళ, తెలుగు ప్రేక్షకులలో నెలకొంది. పాన్ ఇండియా రిలీజ్ చేసేలా మూవీ తీస్తున్నారని టాక్.
రజనీ సోదరిగా జీవిత!
'లాల్ సలాం'లో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఎంత సేపు తెరపై కనిపిస్తారు? అనేది పక్కన పెడితే... కథలో ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యం చాలా ఉంటుందని సమాచారం. రజనీ సోదరిగా జీవితా రాజశేఖర్ కనిపించనున్నారు.
రజనీకాంత్ పాత్ర గురించి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతినిథులు మాట్లాడుతూ ''లాల్ సలాం'లో ఓ శక్తివంతమైన పాత్ర ఉంది. దాన్ని మరోస్థాయికి తీసుకు వెళ్లే గొప్ప నటుడు కావాలని, సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని రిక్వెస్ట్ చేశాం. మాతో ఉన్న అనుబంధం కారణంగా ఆ పాత్రలో నటించడానికి ఆయన ఓకే చెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'లాల్ సలాం' డిఫరెంట్ మూవీ'' అని చెప్పారు.
చెన్నైలో చిత్రీకరణ షురూ!
రజనీకాంత్ స్పెషల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ సంతోష్ (Vikranth Santhosh) హీరోలు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలో 'లాల్ సలాం' చిత్రీకరణ జరుగుతోంది. జీవితా రాజశేఖర్ కూడా చెన్నై వెళ్లారు.
Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా విషయానికి వస్తే... 'కొలమావు కోకిల', 'వరుణ్ డాక్టర్', 'మాస్టర్' తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. అందులో శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ప్రధాన తారాగణం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. 'పుష్ప'లో విలనిజం పండించిన సునీల్, మరోసారి 'జైలర్'లో కూడా విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?