స్టార్ హీరో సినిమా అంటే మినిమమ్ ఏడాది అయినా సరే షూటింగ్ ఉంటుంది. గత కొన్నేళ్లుగా క్వాలిటీ, కంటెంట్ విషయంలో దర్శక నిర్మాతలు ఎవరూ రాజీ పడటం లేదు. పైగా, పాన్ ఇండియా ప్రేక్షకుల చూపు తెలుగు సినిమాలపై ఉండటంతో మరింత జాగ్రత్తగా చేస్తున్నారు. ఇటువంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) జెట్ స్పీడులో షూటింగ్ చేస్తున్నారు.
 
త్రివిక్రమ్ ప్లానింగ్ మరి!
'అతడు', 'ఖలేజా' తర్వాత... సుమారు పదమూడు ఏళ్ళ విరామం తర్వాత మహేష్ బాబు హీరోగా గురూజీ త్రివిక్రమ్ (Trivikram Srinivas) సినిమా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సినిమా గురించి అనౌన్స్ చేశారు. చిన్న షెడ్యూల్ చేశారు. అయితే, పూర్తి స్థాయిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది మాత్రం 2023లోనే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
ఏప్రిల్ నెలాఖరుకు పాటలు, ఒక ఫైట్ మినహా మిగతా టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసేలా షూటింగ్ చేస్తున్నారట. త్రివిక్రమ్ పక్కా ప్లానింగుతో ముందుకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో నాలుగు నెలల్లో మహేష్ సినిమా పూర్తైన దాఖలాలు లేవు. పూరి జగన్నాథ్ ఒక్కరే 'బిజినెస్ మేన్' సినిమాను చకచకా తీశారు. 


సినిమాలో మొత్తం మూడు ఫైట్లు
హీరోగా మహేష్ బాబు 28వ చిత్రమిది. అందుకని, SSMB 28 Movie వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం మూడు ఫైట్లు ఉన్నాయట. దేనికి అదే చాలా విభిన్నంగా ఉంటుందని, ఫైట్స్ విషయంలో త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకున్నారని సమాచారం. 


కండలు చూపించిన మహేష్
ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ బాబు రెండు ఫోటోలు పోస్ట్ చేశారు. ఆ రెండు చూస్తే... ఒక విషయం క్లారిటీగా కనబడుతుంది. ఆయన బైసెప్స్. స్లీవ్ లెస్ టీ షర్టులో మహేష్ కండలు చూపిస్తూ కనిపించారు. అయితే, ఈ కండలు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న తాజా సినిమా కోసమా? ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోయే పాన్ ఇండియా / వరల్డ్ సినిమా కోసమా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 


Also Read వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం 


మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) హ్యాట్రిక్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత వీళ్ళిద్దరూ చేస్తున్న చిత్రమిది. హీరోగా మహేష్ 28వ చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ స్టూడియోలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 


మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దాంతో ఇది పాన్ ఇండియా సినిమా అనే క్లారిటీ వచ్చింది. ఓటీటీ రైట్స్ 80 కోట్ల రూపాయలు పలికినట్లు, ఇది అన్ని భాషలకు కలిపి అని సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహర్షి' తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో మరో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 


Also Read వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?