'ఏజెంట్' సినిమాలో (Agent Movie) ఇద్దరు కథానాయకులు ఉన్నారు. మెయిన్ హీరో... అఖిల్ అక్కినేని. ఆయనతో పాటు మలయాళ మెగాస్టార్, మన తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరో మమ్ముట్టి (Mammootty) ఉన్నారు. అయితే... ఆయనది ప్రత్యేక పాత్ర! సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉన్న పాత్ర. ఆయన అనుభవంతో పోలిస్తే... అఖిల్ చిన్నవాడు. సినిమా కోసం అతడు పడిన కష్టం మాత్రం చాలా పెద్దది. మమ్ముట్టి ఇమేజ్, స్టార్ స్టేటస్ ముందు ఆ కష్టం చాలా చిన్నబోతున్నట్లు కనబడుతోంది. 


మమ్ముట్టి డామినేషన్ చూశారా?
'ఏజెంట్' ట్రైలర్ (Agent Trailer) విడుదల అయ్యింది. తొలుత అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కి గురువు తరహా పాత్రలో మమ్ముట్టి కనిపించారు. ఆ తర్వాత గురు శిష్యుల మధ్య ఏదో జరిగిందని, శిష్యుడిని దేశ ద్రోహిగా గురువు ప్రకటించారని ఆ సీన్లు చూస్తే అర్థం అవుతోంది. 'ఏజెంట్' ట్రైలర్ బావుంది. సినిమాపై అంచనాలు పెంచింది.  'ఏజెంట్' ట్రైలర్ పక్కన పెట్టి, ఒక్కసారి దాని కింద యూట్యూబ్‌లో ఉన్న కామెంట్స్ చూస్తే... మమ్ముట్టి ఫ్యాన్స్ డామినేషన్ ఎక్కువ కనిపించింది.


మమ్ముట్టి కోసం ఫస్ట్ షో చూస్తాం!
ఇప్పుడు మమ్ముట్టి వయసు 70 ఏళ్ళు. ఆ వయసులో ఆయన పడుతున్న కష్టం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. ఆయన కోసం ఈ సినిమా ఫస్ట్ షో చూస్తామని చెబుతున్న ఆడియన్స్ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 'ఏజెంట్' ట్రైలర్ లో మమ్ముట్టి నటన గురించి కామెంట్స్ సెక్షన్ లో చాలా మంది ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. 


'70 ఇయర్స్ లివింగ్ లెజెండ్' అంటూ మమ్ముట్టిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. 'ఏజెంట్'లో ఆయన యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయని వాళ్ళు పేర్కొంటున్నారు. 'ఓన్లీ ఫర్ ది ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా, ద మెగాస్టార్ మమ్ముట్టి' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇప్పటికి 430 సినిమాలు చేసిన ఏకైక మెగాస్టార్ మమ్ముట్టి అంటూ మరొకరు కామెంట్ చేశారు. 


అఖిల్ పడిన కష్టం కోసమైనా?
'ఏజెంట్' కోసం అఖిల్ అక్కినేని ఎయిట్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. రిస్కీ స్టంట్స్ చేశారు. రెండేళ్లకు పైగా విలువైన సమయాన్ని కేటాయించారు. ఆయన పడిన కష్టం కోసమైనా సినిమా హిట్ కావాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్ కామెంట్స్ చూస్తే, 'ఏజెంట్' కోసం వెయిట్ చేస్తున్నది మమ్ముట్టి కోసమా? అఖిల్ కోసమా? అని సందేహం రాక మానదు. మమ్ముట్టి ముందు అఖిల్ పడిన కష్టం చిన్నబోతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. 


Also Read న్యాయ 'వ్యవస్థ'లో రైట్ రాంగ్ ఏమీ ఉండదు - హెబ్బాతో కార్తీక్ రత్నం, కామ్నా


'ఏజెంట్' విడుదల తర్వాత అఖిల్ అక్కినేని సూపర్ స్టార్ అవుతాడని ఈ సినిమా దర్శక - నిర్మాతలు సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో 'సూపర్ స్టార్ ఇన్ మేకింగ్' అంటూ అనిల్ సుంకర స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తమ ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉన్నా... తనకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమని అఖిల్ కూడా స్పష్టం చేశారు. సో... భవిష్యత్తులో ఆయన యాక్షన్ సినిమాలు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. 


Also Read రాముడి సెట్‌లోకి రావణ్ ఎంట్రీ - ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్