Telugu Movie Beauty Update: 2023లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ‘బేబీ’ ఒక‌టి. డిఫరెంట్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీ యూత్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో భాగమయిన ప్రతీ ఒక్కరికీ దీని వల్ల గుర్తింపు లభించింది. కొంత మంది ప్రేక్షకులకు తెలియని విషయం ఏంటంటే... ఈ సినిమా నిర్మాణంలో ఎస్‌కేఎన్‌తో పాటు ప్రముఖ ద‌ర్శ‌కుడు మారుతి కూడా కీల‌క పాత్ర పోషించారు. ఇప్పుడు మారుతి టీమ్ నుంచి ‘బేబీ’ లాంటి మ‌రో యూత్‌ ఫుల్ లవ్ స్టోరీ వస్తోంది.


బ్యూటీ... మరో లవ్ స్టోరీ!


డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించడానికి నిర్మాతగా మారిన మారుతి సిద్ధమయ్యారు. అప్పుడు ‘బేబీ’ అనే టైటిల్‌తో ఆకట్టుకున్నట్టు.. తన అప్‌కమింగ్ మూవీకి ‘బ్యూటీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుబ్ర‌హ్మ‌ణ్యం ఆర్‌ వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో క‌లిసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. ఏ విజ‌య్ పాల్ రెడ్డి నిర్మాత‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ‘బ్యూటీ’కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ మబ్బుల్లో కూర్చున్నట్టుగా, వారిద్దరి ముందు ఒక మబ్బు... లవ్ సింబల్‌లో ఉన్నట్టుగా చూపిస్తూ ఈ సినిమా కూడా యూత్‌ను ఆకట్టుకునే లవ్ స్టోరీ అని హింట్ ఇచ్చారు.


దాదాపు కొత్తవారే..


ఈ రోజు (ఏప్రిల్ 22న) ‘బ్యూటీ’ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అప్పుడే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించి, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘బేబీ’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్‌లు అంతకు ముందే పలు సినిమాల్లో నటించినా కూడా ‘బేబీ’ మాత్రమే వారి కెరీర్‌ను మలుపు తిరిగేలా చేసింది. ఇక యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య... ఆ మూవీతోనే హీరోయిన్‌గా మారింది. అలా ప్రేక్షకులకు ‘బేబీ’ ద్వారా ఈ నటీనటులు దగ్గరయ్యారు. అదే విధంగా ‘బ్యూటీ’లో కనిపించే నటీనటులు అందరూ దాదాపు కొత్తవారే అని తెలుస్తోంది. వారిని కూడా మొదటిసారి చూసినట్టుగానే ప్రేక్షకులు ఫీలవుతారని సమాచారం.


Also Readకొరటాల చేసిన తప్పు నాగ్ అశ్విన్ చెయ్యలేదు - ఆచార్యకు, కల్కికి తేడా అదే మరి!



అలాంటి పాయింట్‌తోనే..


‘బేబీ’ మూవీలో ఈకాలం యూత్‌కు కనెక్ట్ అయ్యే పాయింట్‌ను బాగా చూపించాడు దర్శకుడు సాయి రాజేష్. అదే విధంగా ‘బ్యూటీ’లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక పాయింట్ ఉంటుందని, దాని వల్ల సినిమా యూత్‌కు బాగా నచ్చుతుందని మేకర్స్ చెప్తున్నారు. యూత్‌ను టార్గెట్ చేస్తూనే, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు కూడా చేరువ‌య్యే పాయింట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బేబీ’ ఫేమ్ విజ‌య్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే 3 పాట‌ల రికార్డ్ కూడా పూర్తయ్యిందని సమాచారం. ఇక ఇలాంటి యూత్‌ఫుల్ లవ్ స్టోరీలో నటించే నటీనటులు ఎవరా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడగా.. వారి వివరాలు అతి త్వరలోనే బయటికి రానున్నాయి.



Also Read: చాందిని చౌదరి అంటే నాకు మహా కోపం, షూట్‌లో వెయిట్ చేయించింది కానీ, అజయ్ ఘోష్ సెన్సేషనల్ కామెంట్స్