Ajay Gosh: చాందిని చౌదరి అంటే నాకు మహా కోపం, షూట్‌లో వెయిట్ చేయించింది కానీ, అజయ్ ఘోష్ సెన్సేషనల్ కామెంట్స్

Music Shop Murthy Teaser Launch: నటుడు అజయ్ ఘోష్, హీరోయిన్ చాందిని చౌదరి గురించి ఆసకికర వ్యాఖ్యలు చేశారు. ఆమెతో నటిస్తుంటే తనకు ఈర్ష కలిగేదన్నారు. తన నేచురల్ యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.

Continues below advertisement

Actor Ajay Gosh Sensational Comments About Actress Chandini Chowdary: సీనియర్ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి‘. క్యూట్ బ్యూటీ చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తుంది. శివ పాలడుగు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 50 ఏళ్ల వయసులో డీజే కావాలనుకునే వ్యక్తి, అతని మధ్య తరగతి కుటుంబలోని కష్టాలు, కన్నీళ్లను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. చక్కటి కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొని సందడి చేసింది.

Continues below advertisement

మధ్య తరగతి కుటుంబ కష్టాలు, కన్నీళ్లు ఇందులో ఉంటాయి- అజయ్ ఘోష్

‘మ్యూజిక్ షాప్ మూర్తి‘ టీజర్ లాంచ్ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం తాము పడిన కష్టాన్ని, పొందిన అనుభూతిని వివరించారు. పనిలో పనిగా హీరోయిన్ చాందిని చౌదరిపై ప్రశంసలు కురిపించారు. “మనం మలయాళీ సినిమాలు, తమిళ్ సినిమాలు, మరాఠీ సినిమాలను చూసి భలే ఉన్నాయి. మంచి కంటెంట్ ఉంది అనుకుంటాం. ఆ సినిమాలను చక్కగా ఆస్వాదిస్తాం. అలాంటి సినిమానే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కూడా. ఈ సినిమాలో జీవితం ఉంటుంది. జీవితంలో ఏం కోల్పోతున్నాం. దేనిని ఆశిస్తున్నాం. కోల్పోయిన వాటిని తిరిగి పొందాలంటే ఏం చేయాలి? ఆశించిన వాటిని దక్కించుకోవాలంటే ఎలా ప్రయత్నించాలి? కుటుంబంలో ఉండే ఘర్షణ. ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఇబ్బందులు. ఇద్దరు ఆడపిల్లలను ఇంట్లో పెట్టుకుని, ఓ చిన్నమ్యూజిక్ షాప్ నడిపే ఓ ముసలి వాడు, తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు ఈ సినిమాలో ఉన్నాయి” అని అజయ్ ఘోష్ చెప్పారు.

నటనలో చాందిని నన్ను డామినేట్ చేసేది- అజయ్ ఘోష్

‘మ్యూజిక్ షాప్ మూర్తి‘ సినిమాలో చాందిని చౌదరి నటన చూస్తుంటే తనకు ముచ్చటేసేదని అజయ్ ఘోష్ తెలిపారు. “ఈ చిత్రంలో స్టార్స్ ఎవరూ లేరు. అందరం సాధారణ నటులమే. ఒక్కే ఒక్క సార్ట్ చాందిని. ఆ అమ్మాయి అంటే నాకు మహా కోపం. షూటింగ్ లో లేటుగా వచ్చేది. ఇంత యారగెన్సీగా ఉందేంటి? అనుకునే వాడిని. ఆ తర్వాత ఆమెతో నటిస్తుంటే ఈర్ష కలిగింది. ప్రతి డైలాగ్ ను చాలా నేచురల్ గా చెప్తుంది. నటనలో భలే ఇరగదీస్తా అనే గర్వం నాకు ఉండేది. కానీ, ఆమెతో నటిస్తుంటే నన్ను డామినేట్ చేసేది. ఇంకా ఎలా చేయాలి? అనుకునే వాడిని. చిన్న అమ్మాయి అయినా, నిజంగా ఆమె గొప్ప నటి. కొందరితో నటిస్తుంటే కసి పెరుగతుంది. ఈ అమ్మాయితో నటిస్తుంటే అలాగే అనిపించింది” అని అజయ్ ఘోష్ తెలిపారు.  సీనియర్ నటి ఆమని ఈ చిత్రంలో అజయ్ ఘోష్ భార్య పాత్రలో కనిపించబోతున్నారు. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.   

Read Also: భర్తను కోల్పోయిన ఆమె రెండో పెళ్లికి ఒప్పుకోదు - కానీ, ఆ ‘కోరిక’ తీర్చాలంటుంది.. గుండె బరువెక్కించే మూవీ ఇది

Continues below advertisement
Sponsored Links by Taboola