Tharun Sudhir and Sonal Monteiro to marry on August 11th, 2024: దర్శకులతో హీరోయిన్లు ప్రేమలో పడటం కొత్త కాదు. తెలుగు ప్రేక్షకుల ముందు హ్యాపీ మ్యారీడ్ కపుల్ కృష్ణవంశీ, రోజా ఉన్నారు. ఆర్కే రోజా, సెల్వమణి జంట ప్రయాణం సైతం హీరోయిన్, దర్శకుడిగా మొదలై... ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. హిందీలో యామీ గౌతమ్ - ఆదిత్య ధర్, సోనాలీ బింద్రే - గోల్డీ బెల్, రాణీ ముఖర్జీ - ఆదిత్య చోప్రా, తమిళంలో సుందర్ సి - ఖుష్బూ ఉన్నారు. ఈ డైరెక్టర్ అండ్ హీరోయిన్ కపుల్ లిస్టులోకి కన్నడ దర్శకుడు - నటి చేరుతున్నారు. 


సోనాల్ మోంటెయిరోతో దర్శకుడు తరుణ్ సుధీర్ పెళ్లి!
కన్నడలో డజనుకు పైగా సినిమాలు చేసిన అందాల భామ సోనాల్ మోంటెయిరో (Sonal Monteiro). తుళు సినిమాలతో ఆవిడ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కన్నడ భాషకు షిఫ్ట్ అయ్యింది. త్వరలో ఈ అందాల భామ ఏడు అడుగులు వేయనుంది. ఆ విషయాన్ని సినిమాటిక్ పంథాలో ఓ వీడియో ద్వారా చెప్పింది. తన ప్రేమ కథలో తాను నటిస్తున్నట్లు సోనాల్ చెప్పారు.


Also Read: మీడియాకు ముఖం చాటేసిన పురుషోత్తముడు - కేసులు, క్వశ్చన్స్ దెబ్బకు భయపడ్డాడా?






సోనాల్ మోంటెయిరో పెళ్లి చేసుకోబోతున్నది ఎవరినో తెలుసా? కన్నడ నటుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు అయినటువంటి తరుణ్ సుధీర్ (Tharun Sudhir)ను. వీళ్లిద్దరూ 'రాబర్ట్' సినిమా చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు. అందులో ఆశా భట్ ఓ హీరోయిన్ కాగా... సోనాల్ మరొక హీరోయిన్. ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఆగస్టు 11న తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు తరుణ్, సోనాల్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. తన ప్రేమ కథను తాను డైరెక్ట్ చేస్తున్నట్టు తరుణ్ సుధీర్ పేర్కొన్నారు.  అదీ సంగతి!


Also Readబాలయ్య వీరాభిమానిగా 'బాలు గాని టాకీస్' హీరో - కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆహా






జైలులో ఉన్న దర్శన్ కలిపిన జంట!
తరుణ్ సుధీర్, సోనాల్ మోంటెయిరో కలవడానికి ప్రధాన కారణం కన్నడ స్టార్ హీరో, అభిమాని హత్య కేసులో జైలుకు వెళ్లిన దర్శన్. అవును... 'రాబర్ట్'లో హీరో ఆయనే కదా! దర్శన్ సినిమా వల్ల తరుణ్, సుధీర్ కలిశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. దర్శన్ వల్ల ఎవరికి అన్యాయం జరిగినా వీళ్లిద్దరికీ మంచి జరిగిందని చెప్పుకోవాలి.


Also Readనితిన్, నాగ చైతన్య సినిమాలపై గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ - ఆ హీరోలు ఇప్పుడు ఏం చేస్తారో?