సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా... సోషల్ మీడియాకు మాత్రం ఎప్పుడూ చాలా దగ్గరగా ఉంటోంది. సమంత మయోసైటిస్ నుంచి ఇప్పుడు పూర్తిగా కోరుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు జిమ్‌లో ఎక్కువసేపు గడుపుతోంది. మళ్లీ మునుపటిలా బీస్ట్ మోడ్‌లోకి మారిపోయింది. జిమ్‌లు, వర్కౌట్లు అంటూ సమంత తన సత్తాను మళ్లీ చాటుతోంది.


ఒకప్పుడు మయోసైటిస్ కారణంగా సమంత నడవలేని స్థితిలోకి వెళ్లింది. కనీసం బెడ్ మీద నుంచి లేచి కూర్చునే శక్తి కూడా లేకపోయిందట. కనీసం నడవలేని స్థితికి వెళ్లిపోయానంటూ వాపోయిన సంగతి తెలిసిందే. కానీ సమంత ఇప్పుడు భారీ వర్కౌట్ చేస్తూ బరువులు ఎత్తుతూ కనిపిస్తుంది. సమంత విషయంలో అంతా బాగానే ఉంది కానీ సినిమాలు షూటింగులు, వాటి అప్డేట్లు మాత్రం బయటకు రావడం లేదు.


సమంత కొత్త ప్రాజెక్టు ప్రకటించింది. కానీ దాని గురించి ఇంతవరకు అప్డేట్ లేదు. 'సిటాడెల్' వెబ్ సిరీస్ గురించి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ లేకపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే.. సమంత మీద నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. సమంత మీద ఎప్పుడూ రూమర్లు క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఆ మధ్య నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ టైంలో సమంత రెండో పెళ్లి మీద ఎక్కువగా చర్చలు జరిగాయి.


Also Read: షాక్ ఇచ్చిన రష్మిక... నెల తర్వాత తీరిగ్గా యాక్సిడెంట్, రికవరీ గురించి రివీల్ చేసిందిగా



'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉందని, ఎంగేజ్మెంట్ కూడా త్వరలోనే జరుగుతుందంటూ సమంత గురించి ఇష్టమొచ్చినట్టుగా రూమర్లు క్రియేట్ చేశారు. అలా సమంతపై ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో సమంత తాజాగా ఒక ఫోటోని షేర్ చేసింది. అందులో సమంత హెవీ వర్క్ చేసినట్టుగా కనిపిస్తోంది. ''నేను సన్నగా ఉన్నానా? అసలు బలం లేనట్టు కనిపిస్తున్నానా? ఒకవేళ మీరు అలా అనుకుంటే... నేను గనుక తలుచుకుంటే మీ బ్యాక్ మీద గట్టిగా కొట్టగలను'' అంటూ కామెంట్ పెట్టి కొంటెగా చూస్తున్నట్టుగా ఓ ఎమోజీని పెట్టింది. అది చూసి చాలా మందికి 'ఊసరవెల్లి'లో 'కరెంట్ తీగ కూడా నాలా సన్నగా ఉంటుంది. కానీ, టచ్ చేస్తే షాకే' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుకు వస్తోంది. 



సమంత తాజాగా వదిలిన ఆ ఫోటోని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సమంత ఫిట్నెస్ చేసి ఔరా అనాల్సిందే. చూస్తుంటే సమంత ఏదో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేసేందుకు సిద్దం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.మరి సమంత బంగారం సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 'సిటాడెల్‌'కు మోక్షం ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది. ఇక సమంత ముంబైకి మకాం మార్చిందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సమంత యశోద అంటూ సక్సెస్ కొట్టింది.. శాకుంతలంతో ఫ్లాప్ ఇచ్చింది. ఆ తరువాత ఖుషీ అంటూ పర్వాలేదనిపించింది. మళ్లీ తన స్థాయిలో సమంత ఎఫ్పుడు సక్సెస్ కొడుతుందో చూడాలి.


Also Readతెలుగులో కీర్తి సురేష్ 'రఘు తాత'... ఈ వారమే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడంటే?