కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కొంత విరామం తర్వాత 'కోస్టి' సినిమాతో (Khosty Movie) థియేటర్లలోకి వస్తున్నారు. తమిళ సినిమా 'ఘోష్టి'కి తెలుగు అనువాదం ఇది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న... అనగా బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో ఒకరు గెస్ట్ రోల్ చేశారు. ఇంతకీ, ఆ హీరో ఎవరంటే?


'కోస్టి'లో అతిథిగా తమిళ హీరో జై
'కోస్టి'లో కాజల్ అగర్వాల్ కాకుండా కమెడియన్ యోగి బాబు (Yogi Babu), సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్, మనోబాల, ఊర్వశి, సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమాలో కోలీవుడ్ హీరో జై (Actor Jai) అతిథి పాత్రలో నటించారు. ప్రస్తుతానికి ఆయన క్యారెక్టర్ ఏమిటనేది సస్పెన్స్. మరికొన్ని గంటల్లో థియేటర్లలో చూడొచ్చు. అలయన్స్ విత్ ఘోస్ట్... అనేది ఈ సినిమా ఉపశీర్షిక. అంటే... దెయ్యంతో దోస్తీ, లేదంటే సంధి అని మీనింగ్!


తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల
'కోస్టి'ని తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఇంతకు ముందు శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్' వంటి హిట్ సినిమాను విడుదల చేసింది. ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా, హన్సిక జంటగా వచ్చిన 'గులేబకావళి', జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 'జాక్ పాట్' సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 


హారర్ కామెడీగా 'కోస్టి'
హారర్ కామెడీగా 'కోస్టి' సినిమా తెరకెక్కింది. ఇందులో తండ్రి కుమార్తెల మధ్య  చక్కటి అనుబంధాన్ని కూడా చూపించారు. కథ విషయానికి వస్తే... కాజల్ లేడీ ఇన్‌స్పెక్టర్ రోల్ చేశారు. ఆమె పేరు ఆరతి. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ గ్యాంగ్‌ స్టర్ దాస్ రోల్ చేశారు. జైలు నుంచి తప్పించుకున్న దాసును ఎలాగైనా పట్టుకుని తీరుతానని ఆరతి శపథం చేస్తుంది. కొన్నేళ్ల క్రితం ఆరతి తండ్రి దాసును అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. దాసును పట్టుకునే క్రమంలో అతడిని షూట్ చేయబోయి మరొకరిని షూట్ చేస్తుంది ఆరతి. ఆమె షూట్ చేసింది ఎవరిని? ఆత్మలు ఎందుకు వచ్చాయి? ఆరతి తండ్రిపై పగ తీర్చుకోవడానికి వచ్చిన దాసు ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Read 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా


ఆరతితో పాటు పని చేసే పోలీసులుగా సీనియర్ నటి ఊర్వశి, సత్యన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. పోలీస్ కథకు, దర్శకుడు కావాలని ప్రయత్నించే యోగిబాబు పాత్రకు సంబంధం ఏమిటి? మధ్యలో మానసిక వికలాంగులకు సంబంధించిన ఆస్పత్రికి యోగిబాబు ఎందుకు వెళ్లారు? అనేది ఆసక్తికరం. సినిమాలో రిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఆడు కాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని వంటి భారీ తారాగణం ఉంది.


రిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, 'ఆడు కాలం' నరేన్, మనోబాల, మొట్ట రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని నటించారు. రాధికా శరత్ కుమార్ అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. నీల్ కిచ్లూకు జన్మ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వస్తున్న కాజల్ తొలి చిత్రమిదే.


Also Read : సెలైన్ బాటిల్‌తో షూటింగ్ చేస్తున్న పాయల్ - 'ఆర్ఎక్స్ 100' భామకు ఏమైందంటే?