'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) గుర్తు ఉన్నారుగా! ఇప్పుడు ఆమె ఏపీలో ఉన్నారు. 'మంగళవారం' సినిమా (Mangalavaram Movie) షూటింగ్ చేస్తున్నారు. అక్కడ పాయల్ అనారోగ్యం పాలయ్యారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు పాయల్ పేర్కొన్నారు. అలాగే, ప్రజలకు ఓ సలహా కూడా ఇచ్చారు. అది ఏమిటంటే?
మీ ఆరోగ్యం జాగ్రత్త! - పాయల్
''నాకు డల్ డే ఇది. కిడ్నీ ఇన్ఫెక్షన్ అని తెలిసింది. త్వరగా నేను కోలుకుంటాను. మరింత ఎనర్జీతో మీ ముందుకు వస్తారు. అందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోండి... మీ మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోండి. మంచి నీళ్లు ఎక్కువ తాగండి. ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండండి'' అని ఇంస్టాగ్రామ్ స్టోరీలో పాయల్ పేర్కొన్నారు. ఆరోగ్యం బాలేకపోయినా... . షూటింగ్ చేయడం ఆపలేదు.
సెలైన్ బాటిల్ సహాయంతో పాయల్ షూటింగ్ చేశారు. ఒక వైపు చేతికి సెలైన్ ఎక్కుతుంటే... మరో వైపు ముఖ్యానికి మేకప్ వేసుకున్నారు. మేకప్ రూమ్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారామె. ''యాంటీ బయోటిక్స్ లాస్ట్ డోస్ తీసుకుంటున్నా. ఇంతకు ముందు కంటే శక్తివంతంగా వెనక్కి తిరిగి వస్తా. అవాంతరాలు ఎదురైనా సరే షూటింగ్ ఆపలేదు. ఈ సినిమా నాకు స్పెషల్'' అని పాయల్ తెలిపారు.
'ఆర్ఎక్స్ 100'తో తెలుగులో పాయల్ పాపకు పాపులారిటీ రావడానికి కారణమైన అజయ్ భూపతి, మరోసారి ఆమెతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'మంగళవారం' సినిమాలో పాయల్ నటిస్తున్నారు. అయితే, ఆమె పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read : 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
'ఆర్ఎక్స్ 100' సినిమా తర్వాత తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడి మొదలైందని చెప్పాలి. ప్రేమ కథలు, రొమాంటిక్ గీతాలను తెరకెక్కించే విధానంలో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆ కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'మంగళవారం'.
'మంగళవారం'తో నిర్మాతగా అజయ్ భూపతి!
'మంగళవారం' సినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా మారారు. 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన... ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. తమది పాన్ ఇండియా సినిమా కాదని, సౌత్ ఇండియన్ మూవీ అని చిత్ర బృందం పేర్కొంది.
Also Read : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తలపై కోట శ్రీనివాస రావు సీరియస్
'మంగళవారం' కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... సీతాకోక చిలుక మధ్యలో ఓ అమ్మాయిని చూపించారు. అయితే, ఆ అమ్మాయి ఎవరనేది స్పష్టంగా కనిపించలేదు. త్వరలో హీరో హీరోయిన్ల వివరాలు చెబుతామన్నారు. సినిమాలో మొత్తం 30 కీలక పాత్రలు ఉన్నాయని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : రఘు కులకర్ణి, సౌండ్ డిజైనర్ అండ్ ఆడియోగ్రఫీ : జాతీయ పురస్కార గ్రహీత రాజా కృష్ణన్, ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, సంగీతం : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు : స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, అజయ్ భూపతి, కథ - కథనం - దర్శకత్వం : అజయ్ భూపతి.