కోలీవుడ్, టాలీవుడ్‌లో హీరో విశాల్‌కు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. అయితే విశాల్ తన సినిమాల కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. అంతేకాదు రియల్ యాక్షన్ స్టంట్లు కూడా చేస్తుంటారు. దీని వల్ల ఆయనకు ప్రతీ సినిమా షూటింగ్ సమయంలో ఏదో ఒక గాయం అవుతూనే ఉంటుంది. తాజాగా ‘మార్క్ ఆంటోని’ సినిమా సెట్‌లో ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి చిత్రయూనిట్ మీదకు వచ్చింది. అదే సమయంలో విశాల్క కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. విశాల్ చేసే ప్రతీ సినిమాకు ఇలాంటి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇలా మార్క్ ఆంటోని సినిమా సెట్‌లో జరిగిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై చిత్రయూనిట్ ఇంకా స్పందించలేదు. అధికారికంగా చిత్రయూనిట్ చేసే ప్రకటన తరువాతే అసలు విషయాలు బయటకు వస్తాయి.
ఇక తమిళ యాక్షన్ హీరో విశాల్ రీసెంట్ గా ‘లాఠీ’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోయింది. దీంతో ఇప్పుడు మరో యాక్షన్ మూవీని సిద్ధం చేస్తున్నాడు విశాల్. త్వరలో ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో విశాల్ గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ మూవీలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ షూటింగ్ లో అనుకోని ప్రమాదం జరగడంతో అంతా షాకయ్యారు. ఈ వీడియోలో భారీ వాహనం గోడని ఢీకొట్టుకొని మరీ లోపలికి వస్తుంది.. అయితే ఢీ కొట్టిన తరువాత వెహికల్ అదుపుతప్పి.. ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ల మీదకు దూసుకు వచ్చింది. సీన్‌లో భాగంగా విశాల్ కిందపడిపోయినట్లు నటిస్తున్నాడు. అయితే, ట్రక్కు దూసుకొస్తున్న సమయానికి వెంటనే పైకి లేవలేకపోయాడు. లక్కీగా ఆ వాహనం పక్క నుంచి వెళ్లిపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఈ మూవీలో టాలీవుడ్ యాక్టర్స్ ఇద్దరు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప సినిమాలో విలన్ అవతారామెత్తిన సునీల్.. ఈ చిత్రంలోనూ విలన్ తరహా పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే నటి రీతూ వర్మ విశాల సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జె సూర్య, అభినయ, ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తే... జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.