Manchu Vishnu Said That Mohan Babu's Biopic Make It With Hero Suriya: మోహన్ బాబు (Mohan Babu).. సినీ పరిశ్రమలో ఓ సంచలనం. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో  విలన్‌గా, హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో అభిమానులను అలరించారు. 565కు పైగా చిత్రాల్లో నటించి తన నటన, డైలాగ్ డెలివరీతో మెప్పించి.. 'కలెక్షన్ కింగ్', 'డైలాగ్ కింగ్' అనే బిరుదులు సొంతం చేసుకున్నారు. అటు, నిర్మాతగానూ రాణిస్తున్నారు. తాజాగా ఆయన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో 'మహాదేవశాస్త్రి'గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు బయోపిక్‌పై.. ఆయన కుమారుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


ఇప్పటికిప్పుడు తన తండ్రి బయోపిక్ తీయాలనే ఆలోచన తనకేమీ లేదని.. అయితే, భవిష్యత్‌లో తీసే ఛాన్స్ ఉందని 'కన్నప్ప' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'నేను మోహన్ బాబు బయోపిక్‌లో నటించను. ఎందుకంటే నా తండ్రి పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేను. కానీ మోహన్ బాబు బయోపిక్ తీస్తే మాత్రం తమిళ హీరో సూర్యతో తీస్తాను. తన బ్యానర్‌లో సొంత నిర్మాణంలో ఆ సినిమా రూపొందిస్తాను. కంగువా సినిమాలో తన అద్భుత నటనతో సూర్య సర్ ప్రైజ్ చేశారు.' అని మంచు విష్ణు పేర్కొన్నారు.


Also Read: 'స్టోరీనే ఫైనల్.. కథ బాగుంటే బామ్మ రోల్ అయినా ఓకే' - నేషనల్ క్రష్ రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్


చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించి..


కాగా, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఓ చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు అంచలంచెలుగా ఎదిగి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల వసూళ్ల సినిమాల్లో నటించి 'కలెక్షన్ కింగ్' అనిపించుకున్నారు. అటు, రాజకీయంగా, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఆయన వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మీప్రసన్నలను సినీ పరిశ్రమకు పరిచయం చేయడం దగ్గర నుంచి మొన్నటి ఫ్యామిలీ వివాదం వరకూ ఎన్నో పరిణామాలు జరిగాయి. ఆయన లైఫ్ స్టోరీని బయోపిక్‌గా తీస్తే మంచి సక్సెస్ అందుకుంటుందన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది.


మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'


అటు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' వేసవి సందర్భంగా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు సహా మోహన్ లాల్, ప్రభాస్ వంటి అగ్ర నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను రోల్ మోడల్‌గా తీసుకుని 'కన్నప్ప'ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. 'మహాభారత' సిరీస్ రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్. విష్ణు తనయుడు అవ్రామ్ ఈ చిత్రంతో తెరంగేట్రం చేయనున్నాడు. ప్రభాస్ రుద్ర పాత్రలో, కాజల్ పార్వతీదేవిగా, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో 'కన్నప్ప'ను తెరకెక్కిస్తుండగా.. ఏడేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నట్లు నటుడు మంచు విష్ణు తెలిపారు.


Also Read: వాలెంటైన్స్ డే మీ కోసం కాదు, వెయిట్ ఆంటీ... ప్రేమికుల రోజుపై ఉపాసన పోస్ట్ వైరల్