Thaman's Idhayam Murali Title Teaser Released: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ (Thaman) యాక్టర్‌గా తన కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2003లో వచ్చిన 'బాయ్స్' సినిమాలో హీరో సిద్ధార్థ్ స్నేహితుడిగా ఆయన నటింటి మెప్పించారు. ఆ తర్వాత ఆయన ఏ సినిమాలోనూ నటించలేదు. దాదాపు 22 ఏళ్ల తర్వాత తమన్ 'ఇదయమ్ మురళి' (Idhayam Murali) అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన అథర్వ మురళి ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తుండగా.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ సైతం విడుదలైంది. ఈ సందర్భంగా పోస్టర్‌ను ట్వీట్ చేసిన తమన్.. 'ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. అధర్వ మురళితో కలిసి పెద్ద హిట్ కొట్టబోతున్నాం.' అని తమన్ పేర్కొన్నారు. సినిమాలో హీరో ఫ్రెండ్ రోల్‌లో తమన్ నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. సినిమాలో తమన్‌కు సంబంధించి తాజాగా ప్రోమో సైతం రిలీజ్ చేశారు. తమన్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ బాగున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో అధర్వ లీడ్ రోల్ చేస్తుండగా.. ప్రీతి ముకుందన్, కాయాదు, నట్టి, తమన్, నిహారిక, రక్షణ్ నటిస్తున్నారు. ఇది కూడా ముగ్గురి ఫ్రెండ్స్ కథలా కనిపిస్తోంది. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, జూన్ లేదా జులైలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నటుడిగా తమన్ మంచి సక్సెస్ అందుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: తండ్రీ కొడుకుల మధ్య వివాదం అను'బంధం'గా మారేనా! - ఏడ్పించేసిన కమెడియన్ ధన్‌రాజ్, 'రామం రాఘవం' ట్రైలర్ రిలీజ్

ఈ ప్రాజెక్టులతో తమన్ బిజీ బిజీ

కాగా, టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఆయన సంగీతం అందించిన బాలయ్య 'డాకు మహారాజ్' మూవీ బీజీఎంకు థియేటర్లు దద్దరిల్లాయి. ప్రజెంట్ ఆయన బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తోన్న అఖండ 2 పనుల్లో ఉన్నారు. ఆయన చేతిలో ప్రభాస్ - మారుతి కాంబోలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్', పవన్ కల్యాణ్ - సుజూత్ 'ఓజీ' వంటి బడా ప్రాజెక్టులు సైతం ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు సైతం తమన్ సంగీతం అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ ఓ న్యూక్లియర్ బాంబ్ అంటూ ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Also Read: వాలెంటైన్స్ డే బ్లాక్ బస్టర్ 'తండేల్' - వారం రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు, నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్