Actor Avasarala Srinivas: అవ‌స‌రాల శ్రీ‌నివాస్.. తీసింది కొన్ని సినిమాలు, చేసింది కొన్ని క్యారెక్ట‌ర్లు అయినా.. ఎంతోమంది పేరు తెచ్చుకున్నారు. ర‌చ‌యిత‌గా, డైరెక్ట‌ర్ గా, యాక్ట‌ర్ గా  సినీ ఇండ‌స్ట్రీలో త‌న మార్క్ వేశారు. 'అష్టాచ‌మ్మ 'లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత 'ఊహ‌లు గుస‌గులాడే' లాంటి వాటికి ర‌చ‌యిత‌గా చేసి, 'జోఅచ్యుతానంద' సినిమాలు తీశారు. శ్రీ‌నివాస్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స్టార్ డ‌మ్ ఎవ‌రికి కావాలి? నాకు అయితే న‌చ్చ‌దు అంటూ కామెంట్స్ చేశారు ఆయ‌న‌. ఆరెంజ్ సినిమాలో త‌న సీన్లు చాలా క‌ట్ చేశార‌ని, దానికి తాను ఎప్పుడూ బాధ‌ప‌డ‌న‌ని చెప్పుకొచ్చారు.


రైటింగ్ లో డిప్లొమా చేశారు.. అది ఇక్క‌డ ఉప‌యోగ‌డుతుందా? 


రైటింగ్ అనేది భాష‌కు సంబంధించిన‌ది కాదు అని నాకు అర్థ‌మైంది. సినిమాలు ఎలా రాయాలి అంటే కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఈ మ‌నిషికి ఏం కావాలి? ఇంకో మ‌నిషికి ఏం కావాలి అని తెలుసుకుని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య మంచి విరోధం ఏముండాలి తెలుసుకుని  రాస్తే కాన్ ఫ్లిక్ట్ పొందుతుంది. లాంగ్వేజ్ అనేది సినిమాలో చాలా త‌క్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కొంత‌మంది అప్పుడ‌ప్పుడు మీ తెలుగు బాగుంటుంది అని అంటారు. అప్పుడు నాకు కాంప్లీమెంట్ గా అనిపించినా.. తెలుగుపై వాళ్ల దృష్టి ఎలా ఉంటుంది అంటే ఎక్క‌డో క‌నిపిస్తుంది. అది క‌నిపించ‌కుండా రాయాలి అని అనిపిస్తుంది నాకు. 


రైట‌ర్ గా అంత యాక్టివ్ గా ఉండ‌రంట‌? 


నాకు 'ఊహ‌లు గుస‌గుస‌లాడే' 3.5 ఏళ్లు ప‌ట్టింది. ఫ‌స్ట్ డ్రాఫ్ట్ ఏడాదిలో పూర్తైనా ప్రొడ్యూస‌ర్ల‌కు లైన్ చెప్తూ, ఒక్కో లైన్ మారుస్తూ అలా నాకు అన్నేళ్లు ప‌ట్టింది. ‘ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి’కి 1.5 ఇయ‌ర్స్ ప‌ట్టింది. 'జో అచ్యుతానంద' ఐడియా రావ‌డానికే 7 నెల‌లు ప‌ట్టింది. రైటింగ్ అనేది స్లో ప్రాసెస్. ఒక మ‌నిషి ఒక లాగానే రాయ‌గ‌ల‌డు. అన్ని కొత్త‌గా మొద‌లుపెట్టాలి. 'ఊహ‌లు గుస‌గుస‌లాడే' త‌ర్వాత కొత్త‌గా రాయ‌లేను అనుకున్నాను. ఇంతేనా క్రియేటివిటీ అనిపిస్తుంది. 'జో అచ్యుతానంద' త‌ర్వాత కూడా అదే అనుకున్నాను. ఇప్పుడే మ‌ళ్లీ కొత్త‌గా మొద‌లుపెట్టాను. రైట‌ర్స్ వాల్యూ అనేది బ‌ద్ద‌కానికి మ‌నం పెట్టుకున్న మ‌రో పేరు. అది మ‌నం పెట్టుకున్న‌దే. డెస్క్ ద‌గ్గ‌ర కూర్చుని మ‌నం రాస్తుంటే అదే చాలు. ముందు మ‌న‌కు న‌చ్చిన‌ట్లు రాక‌పోయినా.. ఆలోచించుకుని ముందుకు సాగించొచ్చు. అలా నాకులేట్ అవుతుంది. 


'చింత‌కాయ‌ల ర‌వి'కి మీరు గోస్ట్ రైట‌ర్ అంట‌.  


'చింత‌కాయ‌ల ర‌వి'కి నా స‌హ‌కారం చాలా త‌క్కువ‌. గోస్ట్ రైటింగ్ అని చెప్ప‌కూడ‌దు. ‘అష్టా చ‌మ్మ’ టైంలో రామ్మోహ‌న్ రావు, సురేశ్ గారికి ప‌రిచ‌యం చేస్తే.. నువ్వు రైట‌ర్ క‌దా స్క్రిప్ట్ చూడు అని అన్నారు. అక్క‌డ‌ కోనా వెంక‌ట్ గారికి ప‌రిచ‌యం నేను. నేను రాసింది వారికి కొంచెం న‌చ్చింది. నేను రాసిన స్క్రిప్ట్ ఎక్క‌డో పెట్టి యూఎస్ కి వెళ్లిపోయాను. ఆయ‌న ఫోన్ చేసి స్రిప్ట్ ఎక్క‌డా అన్నారు. క‌నిపించ‌లేదు అని చెప్పాను. దాంతో గుర్తున్న కొంచెం ఆ సినిమాలో పెట్టారు. అందుకే, నా కాంట్రిబ్యూష‌న్ ఉందంటే అన్ ఫేర్ గా చెప్పిన‌ట్లే. 


స్టార్ డ‌మ్ సంపాదించుకోలేక‌పోయారు ఎందుకు? 



నేను ఎక్క‌డ ఉన్నాను అనేది నాకు చాలా హ్యాపీ. నేను ఏ రోలైన చేయ‌గ‌ల‌ను. నాకు ఏంటంటే? అష్టాచ‌మ్మ త‌ర్వాత చాలా క‌థ‌లు వ‌చ్చాయి. ఎలా ఉంటుంది సినిమా అంటే ‘అష్టా చ‌మ్మ’ లాగానే ఉంటుంది. అలానే ఉంటుంది అనేవాళ్లు. అలాంటి సినిమాలు ఒక మూడు చూస్తారు, ఆ త‌ర్వాత ఇంకోటి చూస్తారు. మ‌రి త‌ర్వాత ప‌రిస్థితి ఏంటంటే? ఆ అష్టా చ‌మ్మా లాగానే ఉంటుంది అని వ‌దిలేస్తారు. ప్ర‌తి సినిమాకి అదే జ‌రుగుతుంది. ఇప్పుడు కూడా నాకు చాలా ఆఫ‌ర్స్ వ‌స్తుంటాయి. నిజంగా స్టార్ డ‌మ్ అవ‌స‌రం లేదు నాకు, కంఫ‌ర్ట్ కూడా ఉండ‌దు. నా సినిమా చూసి జ‌నాలు హ్యాపీ అయితే అదే చాలు. అదే స‌క్సెస్ నాకు. పేరు వ‌స్తే బాగానే ఉంటుంది మ‌రి ఎక్క‌వ పేరు వ‌ద్దు. నాకు మంచి న‌టుడిగా పేరు పొందాల‌ని ఉంది. మంచి డైరెక్ట‌ర్ గా పేరుపొందాల‌ని అనుకుందాం అని. స్టార్ డ‌మ్ అనుకుంటాం కానీ, అది బాగోదు అండి. చూసేవాళ్ల‌కి బాగుంటుందేమో అర్రే రాగానే 20 మంది మీద‌ప‌డుతున్నారు అని. కానీ వాళ్ల‌కే అర్థం కాదు వీళ్లు ఎందుకు మ‌న‌మీద ప‌డుతున్నారు అని. నేను కూడా ఫేస్ చేశాను కాబ‌ట్టి చెప్తున్నాను. 


'ఆరెంజ్'లో మీ సీన్లు చాలా తీసేశార‌ట‌?


'ఆరెంజ్'లో తీసేసి ఉంటారు నాకు పెద్ద‌గా తెలీదు. డెఫ‌నెట్ గా చాలా సినిమాల్లో తీసేస్తారు. నేను కూడా నా సినిమాల్లో తీసేశాను. నేను డైరెక్ట్ సినిమాల్లో కూడా తీశాను. క‌థే ఇంపార్టెంట్.. ఆడియెన్స్ ని సినిమాలో ఎంగేజ్ చేయాలంటే కొన్నికొన్ని సార్లు త‌ప్ప‌దు. నేను రాసేట‌ప్పుడు ఇది క‌చ్చితంగా ఉండాలి అని రాసుకుంటాను. కానీ, అది జ‌ర‌గ‌దు. చాలామంది న‌న్ను కూడా అడిగారు. నా రోల్ క‌ట్ అయ్యింది అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఎంత పెద్ద స్టార్ అయినా తీసేస్తే ఏం మాట్ల‌డ‌రు. స్టోరీ ఈజ్ అల్టిమేట్. స్టోరీ ఇంపార్టెంట్. అందుకే, అప్పుడు దాని గురించి నేనేం మాట్లాడ‌లేదు. 


పాన్ ఇండియా సినిమాల గురించి ఏమంటారు? 


రైటింగ్ కి కాలానికి సంబంధం లేదు. కాల‌న్ని బ‌ట్టి రైటింగ్ ఏమి ఉండ‌దు. ఇక ప్ర‌స్తుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ చాలా మంచి ఫేజ్ లో ఉంది. దీని త‌ర్వాత చాలా మంచి జ‌ర‌గ‌బోతుంది ఇండ‌స్ట్రీకి. ఎందుకంటే ప్ర‌పంచంలో ఎటువంటి సినిమాలు తీస్తున్నారు అని ప్ర‌తి ఒక్క‌రు చూస్తున్నారు. ఓటీటీల ద్వారా. సినిమాకి యాక్సిస్ చాలా ఉంది. అందుకే ఫిలిమ్ మేక‌ర్స్ చాలా మారాల్సి ఉంది. రానున్న నాలుగైదేళ్ల‌లో క‌చ్చితంగా మార‌తారు. అది క‌నిపించ‌బోతుంది. అని త‌న కెరీర్ గురించి చెప్పారు శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌.


Also Read: మా నాన్న నన్ను నమ్మి ఎప్పుడూ ఖర్చుపెట్టలేదు, ‘పుష్ప’పై ఉన్న హైప్ చాలు - అల్లు శిరీష్