Allu Sirish: మామూలుగా యంగ్ హీరోలు.. ఏడాదికి రెండు సినిమాలు లేదా ఒక సినిమా అని దూసుకుపోతుంటే.. అల్లు శిరీష్ మాత్రం తెరపై కనిపించి రెండేళ్లు అయిపోయింది. త్వరలోనే ‘బడ్డీ’ అనే డిఫరెంట్ క్రైమ్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దాదాపు ఏడాదిన్నర నుండి ఈ మూవీతోనే శిరీష్ బిజీగా ఉన్నాడు. ఫైనల్‌గా ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అందులో తన సినిమా గురించి, నిర్మాత, దర్శకుడి గురించి మాట్లాడుతూ.. ‘బడ్డీ’ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నాడు అల్లు శిరీష్.
టెన్షన్‌గా ఉంది..
‘‘గతేడాది మూవీ పోస్టర్ రిలీజ్ చేయగానే ఎందుకు మళ్లీ రీమేక్ చేస్తున్నారు, ఈ సినిమా మేము ఆల్రెడీ చూశామని అందరూ అడుగుతూ ఉన్నారు. నేను ఎంత చెప్పినా వాళ్లు నమ్మరు. అందుకే ట్రైలర్ వచ్చాక అందరికీ అర్థమవుతుందని సైలెంట్‌గా ఉండిపోయాను. ఇది రెగ్యులర్ మూవీ కాదు.. కొంచెం కొత్త రకం సినిమా ఇది. ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో అని టెన్షన్ ఉంది కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ కనెక్ట్ అవుతారేమో అనిపించింది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు సినిమాలో పెద్ద స్టార్ ఉన్నా లేకపోయినా తెలుగు ఆడియన్స్ వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాను కూడా కచ్చితంగా చూస్తారని నమ్మకం కలిగింది’’ అంటూ ‘బడ్డీ’ గురించి చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్.
ఫోన్ చేశాను..
‘బడ్డీ’ డైరెక్టర్ సామ్ ఆంటన్ గురించి కూడా శిరీష్ మాట్లాడాడు. ‘‘సామ్ ఆంటన్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమాలు చూశాను. నాకు నచ్చి వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. నీ దగ్గర కథ ఉంటే చెప్పు తెలుగులో చేద్దామన్నాను, తను కూడా సరే అన్నాడు. తనతో పనిచేస్తే బాగుంటుందనే ఆలోచనలోనే ఉన్నాను కానీ అవకాశం రాలేదు’’ అంటూ ఇప్పటికి వాళ్లిద్దరూ కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చిందని శిరీష్ తెలిపాడు. ఇక నిర్మాత జ్ఞానవేల్ గురించి మాట్లాడుతూ.. ‘‘మా నాన్న కూడా నా మీద ఎప్పుడూ ఇంత ఖర్చుపెట్టి సినిమా తీయలేదు. నన్ను నమ్మి నాకు ఎవరూ యాక్షన్ సినిమా ఇవ్వలేదు. అందుకే జ్ఞానవేల్‌కు థ్యాంక్స్’’ అని నవ్వుతూ చెప్పాడు అల్లు శిరీష్.
అదే ఛాలెంజింగ్..
‘పుష్ప’ గురించి మాట్లాడమని అడగగా.. ‘‘ఉన్న హైప్ చాలు.. ఇప్పుడు నేనేమైనా అని, దానికి మీరు డబుల్ ఊహించుని.. ఇదంతా ఎందుకు? టీజర్, ట్రైలర్ వస్తాయి. అవి చూసి మీరే డిసైడ్ అవ్వండి’’ అని సింపుల్‌గా మాట దాటేశాడు అల్లు శిరీష్. ఇక హీరోయిన్స్‌తో నటించడం, టెడ్డీ బెర్‌తో నటించడం మధ్య తేడా చెప్తూ.. హీరోయిన్స్ రియాక్ట్ అవుతారు, టెడ్డీ బేర్ రియాక్ట్ అవ్వదు కాబట్టి అది రియాక్ట్ అవుతుందని ఊహించుకొని నటించడం ఛాలెంజింగ్ అని అన్నాడు. ‘బడ్డీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అయాన్‌ను తీసుకొస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చేశాడు. అల్లు అర్జున్ కూడా ఈవెంట్‌కు వస్తాడా అని అడగగా.. దానికి క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో అయాన్ క్రేజ్ చూస్తుంటే తనకే అసూయగా ఉందన్నాడు అల్లు శిరీష్.
Also Read: ‘బడ్డీ’ ట్రైలర్ - తగ్గేదే లే అంటున్న టెడ్డీ బేర్, యాక్షన్‌తో కుమ్మేసిన అల్లు శిరీష్