Kalki 2898 AD: ఫ్యాన్‌ మూమెంట్‌ - అమెరికాలో కల్కి క్రేజ్‌ మామూలుగా లేదు, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఏం చేశారో చూడండి!

Prabhas Fans Special Wishes to Kalki Team: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వినూత్న షో ప్రదర్శించారు. కల్కి మూవీ రిలీజ్‌ సందర్భంగా చిత్ర బృందానికి విషెస్‌ తెలుపుతూ కారు షో నిర్వహించారు. 

Continues below advertisement

Prabhas Fans Wishes to Kalki Team With Car Show in ST Louis USA: కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన 'కల్కి 2898 AD' మ్యానియానే కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో కల్కి థియేటర్లోకి రాబోతుంది. ఇక ప్రభాస్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరల్డ్‌ వైడ్‌గా 'డార్లింగ్‌' మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. బాహుబలితో వరల్డ్‌ వైడ్‌గా తన మార్కెట్‌ని పెంచుకున్నాడు ప్రభాస్‌. డార్లింగ్‌కు ఇండియాలోనే కాదు వరల్డ్‌ వైడ్‌గా మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న ఫ్యాన్స్‌ వినూత్న ప్రదర్శన చేసి అభిమానాన్ని చాటుకున్నారు. రేపు 'కల్కి 2898 AD' మూవీ విడుదల సందర్భంగా మూవీ యూనిట్‌కి, ప్రభాస్‌కు సరప్రైజ్‌ ఇచ్చారు.

Continues below advertisement

అమెరికాలోని సెయింట్ లూయిస్‌కి చెందిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కార్లతో 'కల్కి' సినిమా పేరును ప్రదర్శించారు. ఇందులో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక  ఈ వీడియో చివరిలో స్టార్‌ స్టార్‌ రెబల్ స్టార్‌ అంటూ ఫ్యాన్స్‌ ఆకాశమంత అభిమానాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాను బాగా ఆకట్టుకుంటుంది. కాగా కార్లతో ఇలాంటి షో చేయడం ఇది మొదటిసారి కాదు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టైంలో మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కూడా ఇలాంటి ప్రదర్శనే చేసి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా అదే చేసి అభిమానాన్ని చాటుకున్నారు. కాగా కల్కి మూవీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రికార్డ్స్‌ సెట్‌ చేసింది. ముఖ్యంగా ఓవర్సిస్‌లో అడ్వాన్స్‌ బకింగ్‌ కల్కి జోరు మామూలుగా లేదు. నార్త్‌ అమెరికాలో ప్రీ సేల్‌లో కల్కి భారీగా బిజినెస్‌ చేసింది.

అక్కడ టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ లక్షకు పైగా టికెట్స్‌ అమ్ముడయినట్టు సమాచారం. ఇక కల్కికి నార్త్‌ అమెరికాలో వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే ఫస్ట్‌ డే ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు చేసేలా ఉందని ట్రేడ్‌ పండితులు అంచనాలు వేస్తున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌లో రికార్డ్స్‌ సెట్‌ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కల్కితో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్‌ తిరగరామడం పక్కా అంటున్నారు. ఇండియా వైడ్‌గా కల్కి మూవీ భారీగానే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఈ వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇక ఓటీటీ, శాటిలైట్‌ డీల్‌పై కూడా ఎలాంటి సమచారం లేదు. ఇలా రిలీజ్‌కు కల్కి మూవీకి జరుగుతున్న బిజినెస్‌ చూస్తుంటే మూవీ ఈజీగా రూ. 1000 కోట్లు దాటేయడం పక్కా అంటున్నారు ట్రేడ్‌ పండితులు. 

Also Read: డిఫరెంట్‌ డ్రెస్సింగ్‌తో షాకిచ్చిన కత్రినా - ప్రెగ్నెంటా? బేబీ బంప్‌ దాస్తోందా.. 

Continues below advertisement