Is Katrina Kaif Hide Baby Bump: పెళ్లి తర్వాత కత్రినా కైఫ్ సైలెంట్‌ అయ్యింది. సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. కొద్ది రోజులుగా అసలు మీడియా ముందుకే రావడం లేదు. చివరిగా ఆమె మేరీ క్రిస్మస్‌తో చిత్రంలో అలరించింది. ఇందులో విజయ్‌ సేతుపతి సరసన నటించిన ఆమె ప్రమోషనల్‌ ఈవెంట్స్‌లోనూ కనిపించలేదు. అయితే చాలా కాలం తర్వాత కత్రినా మీడియా కంట పడింది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించిన ఆమె కత్రినా భిన్నమైన డ్రెస్సింగ్‌తో ఆశ్చర్యపరిచింది. ఇలా కత్రినాను చూసి అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు.


ఇదేంటి ఇలా డ్రెస్సింగ్‌ వేసుకుందంటూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ వీడియోలో కత్రినాను చూస్తుంటే తన బేబి బంప్‌ను కవర్‌ చేసుకునేందుకు ఇలా రెడీ అయ్యిందంటూ కామెంట్స్‌ గట్టిగా వినిపిస్తన్నాయి. కారణం ఈ సీజన్‌లోనూ కత్రినా బ్లాక్‌ దుస్తులు, లూజ్‌ డెనిమ్‌ జాకేట్‌ ధరించింది. అంతేకాదు రాత్రి పూట అయినా సన్‌ గ్లాసెస్‌ ధరించింది. ఇలా షాకింగ్‌ లుక్‌లో కనిపించింది అందరిని డైలామాలో పడేసింది. లూజ్‌ డెనిమ్‌ జాకెట్‌లోనూ ఆమె పోట్ట ముందుకు కనిపిస్తుంది. దీంతో కత్రినా ప్రెగ్నెన్సీ కన్‌ఫాం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


కాగా గతంలో కత్రినా ప్రెగ్నెంట్‌ అంటూ ప్రచారం జరిగింది. అయితే, అవి వార్తలకే పరిమితం అయ్యాయి. కానీ ఈసారి మాత్రం కత్రినా ప్రగ్నెంట్‌ కన్‌ఫాం అంటున్నారు. అంతేకాదు తన డ్రెస్సింగ్‌లోనూ బేబీ బంప్‌ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో కత్రినా తన ప్రెగ్నెన్సీ దాచడానికి ఇలా రెడీ అయ్యిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా కత్రినా కొంతకాలం  హీరో విక్కీ కౌశల్‌తో సీక్రెట్‌ డేటింగ్‌ అనంతరం 2021లో అతడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య రాజస్థాన్‌లో వీరి వెడ్డింగ్‌ గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్లయి మూడేళ్లు అవుతున్న కత్రినా ఇంకా గుడ్‌న్యూస్‌ చెప్పడం లేదని ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. 






ఈ క్రమంలో ఇలా కత్రినా చూసి ఈ జంట అభిమానులు ఖుష్‌ అవుతున్నారు. ఇక తన ప్రెగ్నెన్సీని ఎప్పుడు అనౌన్స్‌ చేస్తుందా అని అంతా వెయిట్‌ చేస్తున్నారు.‌కాగా కత్రినా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కవు టైంలోనే సల్మాన్‌ ఖాన్‌, షారూక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌బీర్‌ కపూర్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. లండన్‌లో పుట్టిన కత్రినా మొదటి తెలుగు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. విక్టరి వెంకటేష్‌ 'మల్లీశ్వరి' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ముంబైకి మాకాం మార్చిన ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కత్రినా గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను అలరించింది. 


Also Read: పెళ్లి పోస్ట్‌పై అలాంటి కామెంట్స్‌ - ట్రోలర్స్‌కి సోనాక్షి సిన్హా స్ట్రాంగ్‌ కౌంటర్