Matka Movie Making Video: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమా తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వింటేజ్ వైజాగ్ సెట్టింగ్ ను రివీల్ చేస్తూ మేకర్స్ ఓ గ్లింప్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రూ. 15 కోట్లతో రామోజీ ఫిల్మ్ సిటీలో వైజాగ్ వింటేజ్ సెట్    


‘మట్కా’ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో మూడో షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇందుకోసం RFCలో 1980 బ్యాగ్రాఫ్ వైజాగ్ లొకేషన్స్ ను రీ క్రియేట్ చేశారు. ఈ స్పెషల్ సెట్ కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తాజా ఈ సెట్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను మేక్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో ‘మట్కా‘ మూవీ కోసం తయారు చేస్తున్న సెట్స్, 80వ దశకం లాంటి సెటప్, వరుణ్ తేజ్ లుక్ కోసం వాడాడాల్సిన కళ్ల జోళ్లు, గడియారాలు, చైన్లు, డ్రెస్సులు ఈ వీడియోలో చూపించారు. అంతేకాదు, రాయల్ ఎన్ ఫీల్డ్ మీద హీరోయిన్ తో కలిసి వెళ్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు కనిపించింది. వీడియోను గమనిస్తే.. అందులో విశాఖ రైల్వే స్టేషన్, గోద్రా పేర్లతో ఉన్న సెట్స్‌ను చూడవచ్చు.






సినిమాపై అంచనాలను పెంచిన ‘మట్కా‘ టీజర్


ఇక ఇప్పటికే విడుదలైన ‘మట్కా‘ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఏకంగా నాలుగు పాత్రల్లో కనిపించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, ‘సత్యం’ రాజేశ్, రవిశంకర్, అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.


‘ఆపరేషన్ వాలంటైన్‘తో అలరించిన వరుణ్ తేజ్


వరుణ్ తేజ్ చివరగా ‘ఆపరేషన్ వాలంటైన్‘ సినిమాలో నటించారు. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా రూపొందిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ హీరోయిన్ గా చేసింది. మార్చి 1న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.   



Read Also: 1000 Crore Movies: బాహుబలిని బీట్ చేసేదెవరు? 1000 కోట్లు క్లబ్బు దాటి వెళ్ళేదెవరు?