సూపర్ స్టార్ మహేష్ బాబుకు థాంక్స్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా మహేష్ బాబుకు థాంక్స్ చెప్పారు. దాంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ, మ‌హేష్‌కు చిరు అండ్ చరణ్ ఎందుకు థాంక్స్ చెప్పారు? ఏమిటి? అంటే...


చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య' (Acharya Movie). దీనికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆల్రెడీ విడుదలైన 'ఆచార్య' ట్రైలర్ చూస్తే... 'పాద ఘట్టం' అనే  ప్రాంతం నేపథ్యంలో కథ సాగుతున్నట్టు చూపించారు. ఆ పాద ఘట్టాన్ని మహేష్ తన గాత్రం ద్వారా పరిచయం చేయనున్నారు. అందుకే, ఆయనకు చిరంజీవి, చరణ్ థాంక్స్ చెప్పారు.


"నేను, చరణ్ నీ వాయిస్ విని ఎంత ఆనందించామో... అభిమానులు, ప్రేక్షకులు కూడా నీ వాయిస్ విని అంతే థ్రిల్ అవుతారని నమ్ముతున్నా. 'ఆచార్య' సినిమాలో ఓ పార్ట్ అయినందుకు థాంక్యూ" అని చిరంజీవి ట్వీట్ చేశారు. "థాంక్యూ మహేష్. 'ఆచార్య' సినిమాను మీరు మరింత ప్రత్యేకంగా మార్చారు. వెండితెరపై ప్రేక్షకులు ఎప్పుడు ఎక్స్‌పీరియ‌న్స్‌ చేస్తారా? అని ఎదురు చూస్తున్నాను" అని రామ్ చరణ్ పేర్కొన్నారు.


Also Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ










చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. ఈ నెల 29న సినిమా (Acharya On April 29) విడుదల కానుంది. 




Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?