'ఎఫ్ 3' సినిమాలో 'ఊ ఆ ఆహా ఆహా' సాంగ్ (Woo Aaa Aha Aha Out Now) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రోమో విడుదలైంది. ఆల్మోస్ట్ 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రోమోలో హీరోయిన్లు తమన్నా (Tamannaah looks glamorous in F3 Movie), మెహరీన్ (Mehreen Kaur Pirzada) గ్లామర్ హైలైట్ అయ్యింది. ఈ రోజు ఫుల్ లిరికల్ వీడియో విడుదల చేశారు.


'ఎఫ్ 3' సినిమాలో వెంకటేష్ (Venkatesh F3 Movie) సరసన తమన్నా, వరుణ్ తేజ్‌ (Varun Tej) కు జోడీగా మెహరీన్ కౌర్ నటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ 'ఎఫ్ 2' సినిమాలో ఈ జోడీలు ఆకట్టుకున్నాయి. మరోసారి 'ఎఫ్ 3'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 'ఎఫ్ 2'లో 'గిర్రా గిర్రా...' పాటకు మించి అనేలా 'ఊ ఆ ఆహా ఆహా' సాంగ్ (Woo Aaa Aha Aha Song) ఉంది.


'నీ కోర మీసం చూస్తుంటే...
నువ్వట్టా తిప్పేస్తుంటే... 
ఊ ఆ అహా అహా!
నీ మ్యాన్లీ లుక్కేచూస్తుంటే... 
మూన్ వాక్ చేసే నా హార్టే'
'ఊ ఆ అహా అహా!' అంటూ ఈ సాంగ్ సాగింది.






దేవి శ్రీ ప్రసాద్ సంగీతం (Devi Sri Prasad - F3 Songs)లో సునిధీ చౌహన్, లవితా లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ ఆలపించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. పాటలో సునీల్, సోనాల్ చౌహన్ కూడా సందడి చేశారు.


Also Read: కాజల్ కుమారుడిది తల్లి పోలికా? తండ్రి పోలికా? నిషా ఏం చెబుతున్నారంటే?


పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో, సోనాల్ చౌహన్ ప్రత్యేక కథానాయికగా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఇతర తారాగణం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మే 27న సినిమా (F3 movie On May 27) విడుదల కానుంది.



Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?


Watch Woo Aaa Aha Aha Lyrical Video From F3 Movie Here: