లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి త్వరలోనే 'లియో'(Leo) మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 'విక్రమ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తలపతి విజయ్ తో రెండోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాల నెలకొన్నాయి. అందరికంటే ముందుగా దసరా స్లాట్ ని బుక్ చేసుకొని అదే దిశగా పరుగులు పెడుతున్న ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.


తాజాగా నుంచి త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో త్రిష షాకింగ్ లో కనిపించింది.' రక్తపాతాన్ని చూస్తూ భయంతో షాక్ అవుతున్నట్లు' ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. త్రిష పోస్టర్ ని రిలీజ్ చేసిన టీం ఈరోజే ట్రైలర్ కూడా విడుదల కాబోతోందని పేర్కొంది. దీంతో ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తుండడంతో ప్రమోషన్స్ సైతం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. తమిళంతో పాటు తెలుగులోనూ వరుస ప్రమోషన్స్ ని నిర్వహించాలని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.






దానికి కారణం ఇటీవల కాలంలో తెలుగులో డబ్ అయిన కొన్ని తమిళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్నాయి. విజయ్ కి తమిళం తో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. దానికి మించి లోకేష్ కనగరాజ్ సినిమాలకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉండడంతో సినిమాను పెద్ద లెవెల్ లో ప్రమోట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి ఓ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా 'లియో' డబ్బింగ్ హక్కుల కోసం సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఏకంగా రూ.21 కోట్లు పెట్టి కొనడం ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది.


పైగా 'లియో'కి పోటీగా దసరాబరిలో బాలయ్య 'భగవంత్ కేసరి' రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' వంటి భారీ సినిమాలు ఉండగా ఓ డబ్బింగ్ సినిమాకి అంత రేటు పెట్టి కొనడం అంటే అది మామూలు విషయం కాదు. అటు తమిళనాడులో కూడా ఈ మూవీ కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్లు తెగ పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఉదయనిది స్టాలిన్ కి చెందిన రెడ్ జాయింట్ సంస్థ ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకునేందుకు ప్రయత్నించగా అది వర్కౌట్ కాలేదు.


తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ 'లియో' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19న థియేటర్స్ లో విడుదల కానుంది.


Also Read : విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం? - ఇక నుంచి కొత్త పద్ధతిలో సెన్సార్ ప్రక్రియ!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial