కోలీవుడ్ అగ్ర హీరో విశాల్ ఇటీవల స్సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్' (CBFC) ముంబై కార్యాలయంలో అవినీతి జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి అందరికీ తెలిసేలా ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ స్పందించింది. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అనంతరం దీనిపై స్పందిస్తూ.. విశాల్ నుంచి లంచం డిమాండ్ చేసింది సెన్సార్ సభ్యులు కాదని, థర్డ్ పార్టీ వారని తెలిపింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.


ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పటినుంచి ఆన్లైన్లోనే సినిమాల సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది." CBFC ప్రతి సంవత్సరం 12 వేల నుంచి 18 వేల చిత్రాలకు సర్టిఫికెట్ ఇస్తుంది. ఇన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుంది. కొందరు నిర్మాతలు తమ సినిమాలకు అత్యవసరంగా సర్టిఫికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటారు" అని ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు గుర్తు చేసింది.  ఇలాంటి పరిణామాలు రిపీట్ కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఈ - సినీప్రమాన్‌ను తీసుకొచ్చిన సెన్సార్ బోర్డు.. దీన్ని వేదికగా దర్శక, నిర్మాతలు తమ సినిమాలకు సెన్సార్ చేసుకోవాలని సూచించింది.






CBFC పై విశాల్ చేసిన ఆరోపణలు ఏంటంటే?


తన 'మార్క్ ఆంటోనీ' సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని కొద్ది రోజుల క్రితం విశాల్ ట్విట్టర్ వేదిక వెల్లడించారు. 'మార్క్ ఆంటోనీ' సెన్సార్ కోసం దాదాపు 6.5 లక్షలు లంచం చెల్లించాలని విశాల్ పేర్కొన్నాడు." అవినీతి గురించి వెండితెరపై చూడడం బానే ఉంటుంది కానీ నిజ జీవితంలో జరగడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నా. ముంబై సెన్సార్ ఆఫీస్ లో ఇదే జరుగుతోంది. నా మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ కకోసం రూ.6.5 లక్షలు లంచం గా ఇచ్చాను. స్క్రీనింగ్ కోసం రూ.3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం మూడు లక్షలు ఇచ్చాను. నా కెరీర్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మరో దారి లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతకు ఇలా జరగకూడదు. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా" అంటూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే దృష్టికి తీసుకెళ్తానని చెబుతూ ఈ మేరకు ఆ ఇద్దరి ట్విట్టర్(ఎక్స్) ఖాతాలను ట్యాగ్ చేశారు. దాంతోపాటు తాను ఎవరెవరికి డబ్బులు పంపించారో వారి పేరు బ్యాంకు ఖాతా వివరాలను సైతం పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సెన్సార్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి ఇక నుంచి ఆన్ లైన్ లోనే సినిమాల సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయబోతున్నట్లు నిర్ణయం తీసుకుంది.


విశాల్ 'మార్క్ ఆంటోనీ' విషయానికొస్తే..


అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించగా రీతూ వర్మ కథానాయికగా నటించింది. విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుని తమిళంలో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందించారు.


Also Read : త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial