సంక్రాంతి బరిలో ‘సైంధవ్’


టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,  'హిట్' దర్శకుడు శైలేష్ కొలను కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'సైంధవ్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఎలాంటి బ్రేకులు లేకుండా ఈ మూవీ షూటింగ్ నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. వాస్తవానికి ‘సైంధవ్’ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, కొన్ని కారణాలతో రిలీజ్ డేట్ ను పోస్టుపోన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టుగా చెప్పారు. 


 ఈసారి సంక్రాంతి కి లెక్క మారిపోయేనా?


దగ్గుబాటి వెంకటేష్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా 'సైంధవ్' మూవీ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకు వెంకటేష్ కెరీర్ లో ఎప్పుడూ కనిపించని కొత్త గెటప్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ తో కీలక విషయాన్ని వెల్లడించింది. 'ఈసారి సంక్రాంతి కి లెక్క మారుద్ది' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్ ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. వెంకటేష్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ పడటం ఖాయం అని భావిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తో పాటు కొంత టాకీ పార్ట్ ను కూడా చిత్రీకరిస్తున్నారట. సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ వెంకటేష్ కి భార్యగా కనిపించబోతోంది.   


టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటుడు






ఇక ‘సైంధవ్’ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా రూపొందుతోంది. దర్శకుడు శైలేష్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.  ఈ సినిమాలో నవాజుద్దీన్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారున తమిళ హీరో ఆర్య సైతం మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళతో పాటు రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా 'దసరా' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ,మలయాళ భాషలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.  


Read Also: జూ. ఎన్టీఆర్ ను ఏనాడు పట్టించుకోలే, చంద్రబాబు అరెస్టు గురించి ఎందుకు మాట్లాడాలి?- తమ్మారెడ్డి


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial