Arundhati Deleted Scene: ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోతున్న చాలామంది తమ కెరీర్ మొదట్లో ఎన్నో ఫ్లాపులు చూసుంటారు. అలాంటి వారి కెరీర్‌ను ఏదో ఒక్క సినిమా మలుపుతిప్పి ఉంటుంది. అనుష్క కెరీర్‌లో అలాంటి సినిమానే ‘అరుంధతి’. అప్పటికే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు టాలీవుడ్‌లో గుర్తింపు ఉంది. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను యాక్సెప్ట్ చేసేవారు. కానీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెలుగులో తెరకెక్కిన మొదటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘అరుంధతి’. తాజాగా ఈ సినిమాలోని ఒక డిలీటెడ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తూ ‘అరుంధతి’ రోజులను గుర్తుచేసుకుంటున్నారు అనుష్క ఫ్యాన్స్.


టాప్ హీరోయిన్‌గా అనుష్క..


‘అరుంధతి’ కంటే ముందు చాలా కమర్షియల్ సినిమాల్లో నటించింది అనుష్క. అప్పటికే చాలామంది స్టార్ హీరోలతో కూడా జతకట్టింది. అలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. కానీ అనుష్క కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం ‘అరుంధతి’. అప్పటివరకు కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే చేయడానికి ఏ హీరోయిన్ ముందుకు రాలేదు. అలా వచ్చినా కూడా అవి యావరేజ్ హిట్లుగానే నిలిచాయి. కానీ ‘అరుంధతి’ తర్వాత అనుష్కకు వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే అవకాశం లభించింది. అలా చాలాకాలం పాటు తను టాలీవుడ్‌లో నెంబర్ 1 హీరోయిన్‌గా వెలిగిపోయింది.


డిలీటెడ్ సీన్..


ముఖ్యంగా ‘అరుంధతి’లో జేజమ్మగా అనుష్క నటనను ఇప్పటికీ ఫ్యాన్స్ మరచిపోలేరు. ఎంత ధైర్యవంతురాలైన ఒక మహారాణి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది స్వీటి. అందులో కొన్ని సీన్స్, అవి చూసినప్పుడు వారి ఎక్స్‌పీరియన్స్‌ను కొందరు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ మూవీలో ఎన్నో పవర్‌ఫుల్ సీన్స్ ఉన్నాయి. అలాంటి ఒక పవర్‌ఫుల్ సీన్‌ను మేకర్స్ డిలీట్ చేశారు. ఇందులో ఒక పాప ప్రాణాన్ని కాపాడుతుంది అనుష్క. అప్పుడు అందరూ తనలో జేజమ్మను చూస్తారు. ఇలాంటి మంచి సీన్‌ను అసలు మేకర్స్ ఎందుకు డిలీట్ చేశారా అని దీనిని చూసిన ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇది కూడా మూవీలో ఉంటే బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు.



జీవితాలు మార్చేసింది..


2009లో విడుదలయిన ‘అరుంధతి’ని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. ఇప్పటికీ తన కెరీర్‌ను మార్చిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ముందుంటారని అనుష్క చెప్తుంటుంది. అప్పటివరకు ఏ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించనంత భారీ బడ్జెట్‌తో ‘అరుంధతి’ని తెరకెక్కించారు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అప్పట్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లను కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇందులో విలన్‌గా నటించిన సోనూ సూద్ సైతం టాలీవుడ్‌లో వరుసగా విలన్ ఆఫర్స్ అందుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోయాడు. అలా ‘అరుంధతి’ మూవీ ఎంతోమంది జీవితాలను మార్చేసింది. ఒకరకంగా ‘అరుంధతి’ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ ఫేట్ మార్చేసిందని చెప్పవచ్చు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు స్ఫూర్తిని ఇచ్చిన చిత్రం ఇది.



Also Read: ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో కమల్ హాసన్ లుక్ ఇదేనా? ఈ వైరల్ ఫొటోల వెనుక అసలు కథ ఇదీ!