సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకుంటున్నారు. ఎంతోమంది హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న చిన్నారులకు ప్రాణదాతగా మారి తన అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేస్తున్నారు మహేష్ బాబు. తాజాగా మరో చిన్నారికి ఆయన ఉచితంగా హార్ట్ సర్జరీ చేయించిన విషయం వైరల్ అవుతుంది.
సాధారణంగా స్టార్ హీరోలని డై హార్డ్ ఫ్యాన్స్ దైవంగా కొలుస్తారు. అయితే కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినిమాకు సంబంధం లేని కొన్ని కుటుంబాలు కూడా ఒక హీరోను దేవుళ్ళుగా చూడాలంటే వాళ్ళు చేసే పని కూడా చూడగానే దండం పెట్టే రేంజ్ లో ఉండాలి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న పని కూడా అదే. అందుకే రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఎన్నో కుటుంబాలు ఆయనను దేవుడిగా కొలుస్తున్నాయి.
తాజాగా మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కత్తుల వారి పేటకు చెందిన ఓ చిన్నారికి చేసిన సాయం ఆయనను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఈ రెండేళ్ల చిన్నారి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతుండగా, ఇప్పుడు ఆ పాపకు మహేష్ బాబు ఫౌండేషన్ ఉచితంగా హార్ట్ సర్జరీ చేయించింది. దీంతో అభిమానులు కృతజ్ఞతగా మహేష్ బాబు నటించిన 'ఖలేజా' సినిమాలోని డైలాగ్ ని ఓ పెద్ద పోస్టర్ ద్వారా ప్రదర్శించి తమ కృతజ్ఞతను తెలియజేశారు.
ఆ ఫ్లెక్సీలో అభిమానులు 'నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం మా గన్నవరంది స్వామి. పూజించే రాళ్లలో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు గానీ 3772 ప్రాణాలు కాపాడిన మా మహేశ్వరుడిలో మాత్రం దేవుడు ఉన్నాడు.. ఆయన మాకు దేవుడు, అలాంటి వ్యక్తికి మేము భక్తులం" అంటూ ఓ పెద్ద ఫ్లెక్సీ పట్టుకుని ఊరంతా తిప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా మహేష్ బాబు తన పేరుతో ఫౌండేషన్ ను స్థాపించి, ఇలా చిన్నారులకు ప్రాణం పోయడం వెనక మనసును కదిలించే స్టోరీ ఉంది.
డబ్బుంది కాబట్టి మనం మన ఇంటి బిడ్డను కాపాడుకుంటున్నాం. మరి డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి అనే ఒకే ఒక్క ఆలోచన ఆయనను ఇన్నిప్రాణాలు కాపాడేలా చేసిందని స్వయంగా మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని హాస్పిటల్స్ చొరవతో మహేష్ బాబు గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా సేవలను అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీ గురించి మహేష్ అభిమానులతో పాటే దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఏ ఈవెంట్ లో కంపించినా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : Pushpa 2 Release Date: ఒక్కరోజు ముందుకు వచ్చిన 'పుష్ప'రాజ్ - అఫీషియల్ రిలీజ్ డేట్Read Also : Pushpa 2 Release Date: ఒక్కరోజు ముందుకు వచ్చిన 'పుష్ప'రాజ్ - అఫీషియల్ రిలీజ్ డేట్