Allari Naresh's 12A Railway Colony Updates: 'అల్లరి' నరేష్ కథానాయకుడిగా రూపొందుతున్న థ్రిల్లర్ '12 ఏ రైల్వే కాలనీ'. ఇందులో 'పొలిమేర' ఫేమ్ డాక్టర్ కామాక్షీ భాస్కర్ల హీరోయిన్. నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దీనికి 'పొలిమేర' సిరీస్ ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
మర్డర్ మిస్టరీ... రైల్వే కాలనీలో ఏమైంది?'12 ఏ రైల్వే కాలనీ' ట్రైలర్ చూస్తే... మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే సినిమా అని అర్థం అవుతోంది. కానీ అల్లరి నరేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం ఆసక్తి కలిగించింది. మంచు కొండల్లోకి ఆయన ఎందుకు వెళ్లారు? ఇక్కడ మర్డర్ మిస్టరీకి ఆయన సంబంధం ఏమిటి? అనేది స్క్రీన్ మీద చూడాలి. హత్యల గురించి హీరోకి ఎలా తెలిసింది? అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: నెట్టింట నిహారిక వీడియో వైరల్... 'ఇరువురి భామల కౌగిలిలో' ఓపెనింగ్ - అసలు విషయం ఏమిటంటే?
'అన్నీ తెలిసిన మీరు ప్రపంచం ముందు మౌనంగా ఉండటం నాకు ఏమీ అర్థం కావడం లేదు సార్' అని ఓ మహిళ చెప్పగా, 'కొన్ని కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అవుతుంది' అని సాయి కుమార్ చెప్పడం, ఆ వెంటనే మంచు కొండల్లో ఎవరినో పాతిపెడుతున్నట్టు హీరోని చూపించడం మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ సినిమాలతో పాపులరైన నరేష్, ఈసారి మంచి థ్రిల్ ఇవ్వబోతున్నట్టు అర్థం అవుతోంది.
Also Read: బికినీలో బాలీవుడ్ భామ... తెలుగులో నానితో సినిమా చేసింది... ఎవరో గుర్తు పట్టారా?
12A Railway Colony Movie Cast And Crew: 'అల్లరి' నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా రూపొందిన '12ఏ రైల్వే కాలనీ' సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, 'వైవా' హర్ష, 'గెటప్' శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కుశేందర్ రమేష్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, సమర్పణ: పవన్ కుమార్, కథ - కథనం - మాటలు - షో రన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఎడిటర్ - దర్శకత్వం: నాని కాసరగడ్డ.