- చిరంజీవిని పిల్లలకు దగ్గర చేసిన ‘పసివాడి ప్రాణం’
- ఈ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్స్ లు
- మొత్తం 6 భాషల్లో రీమేక్
- రష్యాలోకి డబ్ అయిన తొలి చిరంజీవి సినిమా
- అన్నిటికంటే తెలుగులోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్
- చిరంజీవి తో బ్రహ్మానందం తొలిసారి కలిసి యాక్ట్ చేసిన సినిమా
- రఘువరన్ - బాబ్ ఆంథోనీ ల తొలి తెలుగు సినిమా
- స్లాబ్ సిస్టం ను ఎదుర్కొని 175 రోజులు ఆడిన తొలి సినిమా
- 5 భాషల్లోనూ ఒకే చైల్డ్ ఆర్టిస్ట్ ,ఒకే సైడ్ విలన్
చిరంజీవి నటించిన సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’ సినిమా స్పెషాలిటీ నే వేరు. 23 జూలై, 1987 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ లో రోజుకు 5 ఆటలతో 175 రోజులు ఆడింది. ఆ రికార్డ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తిరుపతితో పాటు నెల్లూరు ,అనంతపూర్ లలో కూడా 5 షోలతో 100 డేస్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇదికూడా ఒక రికార్డే. ఎందుకంటే ప్రభుత్వం తెచ్చిన స్లాబ్ సిస్టం వలన 100 రోజులు ఆడడం అనేది తగ్గిపోయిన రోజులవి. అలాంటి పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘పసివాడిప్రాణం’. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ మూవీని ముందుగా మలయాళంలో తీశారు. ఆ తర్వాత పలు భాషల్లో రీమేక్ చేశారు. 5 భాషల్లోనూ డిఫెరెంట్ క్లైమాక్స్ లు ఉండడం విశేషం. ఆ తరువాత మరో రకం క్లయిమాక్స్ తో హిందీలో తీస్తే అక్కడా హిట్ అయింది.
1) పూవిన్ను పుతియా పూంతె న్నాళ్ (Poovinnu Puthiya Poonthennal) - మలయాళం
హీరో: మమ్ముట్టి, రిలీజ్: 12, సెప్టెంబర్ 1986
రిజల్ట్: ఫ్లాప్
హంతకుల చేతిలో విధవరాలైన తన తల్లిని కోల్పోయిన ఒక మూగ చెవిటి పిల్లాడు. వాళ్ళ చేతి నుంచి తప్పించుకుపోయి.. మందుకు బానిసైన మమ్ముట్టి కి దొరుకుతాడు. ఆ పిల్లాడిని పెంచుకుంటున్న మమ్ముట్టి మద్యం వ్యసనం నుంచి బయటపడడంతో పాటు అతని తల్లిని చంపిన హంతకుల నుంచి బాలుడిని కాపాడి తాను కూడా ఆ పోరాటంలో చనిపోతాడు.
1986లో రిలీజైన ఈ సినిమా మలయాళంలో పెద్దగా ఆడలేదు. కానీ తరువాత కాలంలో కల్ట్ క్లాసిక్ అయింది. విమర్శకుల ప్రశంసలు పొంది ఇతర భాషల నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో విలన్ గా మరో మలయాళ హీరో సురేష్ గోపీ నటించడం విశేషం. సైడ్ విలన్ గా బాబ్ ఆంథోనీ నటించారు. పిల్లాడిగా నటించింది బేబీ సుజిత కాగా, హీరోయిన్ ‘అత్తారింటికి దారేది’లో నటించిన నదియా .
2) పూవిజి వాసలిలే (Poovizhi Vasalile) - తమిళం
హీరో: సత్యరాజ్
రిలీజ్: 14 జనవరి 1987
రిజల్ట్ : సూపర్ హిట్
1987 లో తమిళంలో సత్యరాజ్ హీరోగా వచ్చిన ఇదే సినిమా 23 వారాలు హౌస్ ఫుల్స్ తో నడిచింది. చాలా సెంటర్లలో 100 రోజులు ఆడిన ఈ సినిమా సత్యరాజ్ కు స్టార్ స్టేటస్ తెచ్చింది. ఇందులో విలన్ గా రఘువరన్, సైడ్ విలన్ గా బాబ్ ఆంథోనీ నటించారు. ఇందులో కూడా పిల్లాడిగా బేబీ సుజిత నటించగా హీరోయిన్ గా కార్తీక నటించింది. ఈ సినిమా క్లైమాక్స్ లో విలన్ లను చంపిన సత్యరాజ్ కు జైలు శిక్ష పడడంతో కథ ముగుస్తుంది.
3) పసివాడి ప్రాణం, తెలుగు
హీరో: చిరంజీవి
రిలీజ్: 23, జూలై 1987
రిజల్ట్: బ్లాక్ బస్టర్
మొదటి ఆట నుంచే సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో కూడా విలన్ లుగా రఘువరన్, బాబ్ ఆంథోనీలు కనిపిస్తారు. పిల్లాడిగా బేబీ సుజిత నటించింది. హీరోయిన్ విజయశాంతి. ఇక ఈ సినిమాలో ఇనస్పెక్టర్ గా కన్నడ హీరో కన్నడ ప్రభాకర్ నటించగా బ్రహ్మానందం చిన్నపాత్రలో తొలిసారి చిరంజీవితో కలిసి నటించారు. రఘువరన్, బాబ్ ఆంథోనీలకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఈ సినిమా క్లైమాక్స్ లో విలన్లు చనిపోగా.. బిల్డింగ్ పైనుంచి వేలాడుతున్న పిల్లాడిని కాపాడి సురక్షితంగా బయటపడతాడు హీరో.
4) ఆపద్బాంధవ, కన్నడ
హీరో: అంబరీష్
రిలీజ్: 14, డిసెంబర్ 1987
రిజల్ట్: హిట్
ఇది కూడా తెలుగు వెర్షన్ లానే ఉంటుంది. అయితే క్లైమాక్స్‌లో హీరో -హీరోయిన్ లుగా నటించిన అంబరీష్ -పారిజాతల పెళ్లితో ముగుస్తుంది. ఇందులో విలన్ గా రఘువరన్ ఉండరు. కానీ,సైడ్ విలన్ గా బాబ్ ఆంథోనీ, పిల్లాడిగా బేబీ సుజిత కనిపిస్తారు. నాలుగు భాషల్లోనూ క్లాసిక్ గా నిలిచిపోయిన పసివాడి ప్రాణం సినిమా ఇలా నాలుగు భాషల్లో నాలుగు డిఫెరెంట్ క్లైమాక్స్ లు ఉండడం విశేషమే. ఆ తర్వాత ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారు.
5) హత్య, హిందీ
హీరో: గోవిందా
రిలీజ్: 3, జూన్ 1988
రిజల్ట్: హిట్
చాలా వరకూ తెలుగు సినిమానే ఫాలో అయినా.. దీని క్లైమాక్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దీనిలో మెయిన్ విలన్ అనుపమ్ ఖేర్ చనిపోగా .. సైడ్ విలన్ బాబ్ ఆంథోనీ మాత్రం బతుకుతాడు. అతణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు హీరో గోవిందాను నిర్దోషి గా విడుదల చేస్తారు. హీరోయిన్ గా నీలం నటించిన ఈ సినిమాలో పిల్లాడిగా బేబీ సుజిత నటించింది. ఇలా ఇండియా లో 5 భాషల్లో ఒక సినిమా రూపొందడం అన్ని భాషల్లోనూ సైడ్ విలన్, చైల్డ్ ఆర్టిస్ట్ లు రిపీట్ కావడం కూడ ఒక రికార్డ్.
బంగ్లాదేశ్ -శ్రీలంకల్లో కూడా రీమేక్ అయిన పసివాడి ప్రాణం: ‘పసివాడి ప్రాణం’ సినిమాను ఖోతిపురొన్ (khotipuron ) పేరుతో బంగ్లాదేశ్‌లో, ‘వేద బరిణమ్-వేదేక్ నెహే’ పేరుతో శ్రీలంకలోనూ రీమేక్ చేశారు. కానీ.. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని అభిమానులే అంటుంటారు. ఒరిజినల్ మలయాళం వెర్షన్ కంటే తెలుగు వెర్షనే ఎక్కువగా పాపులర్ కావడతో దానినే ఇతర భాషల్లో ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నారు.
Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మతిరిగే రియాక్షన్
Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!