మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా 2022 ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్దే ఈ సినిమాలో నటిస్తున్నారు.

Continues below advertisement


మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి లాహే లాహే సాంగ్ ఇప్పటికే విడుదలై పెద్ద హిట్ అయింది. దీంతో అభిమానులు, సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.


ఈ సినిమా విడుదలపై ఇప్పటివరకు రకరకాల వార్తలు వినిపించాయి. 2022 జనవరి ఏడో తేదీన సినిమా విడుదల అవుతుంది.. ప్రకటన రావడమే తరువాయి అనే రేంజ్‌లో లీకులు వచ్చాయి. ఇంతలో ఆ డేట్‌ను ఆర్ఆర్ఆర్ తీసేసుకుంది. దీంతో ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన వస్తుందని, పుష్ప వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పుష్ప, ఆచార్య పోటీ పడతాయని.. రెండూ ఒకేరోజు విడుదల అవుతాయని.. ఇలా రకరకాల పుకార్లు వినిపించాయి. ఇప్పుడు ఈ అధికారిక ప్రకటనతో పుకార్లన్నిటికీ తెర పడింది.


2018లో భరత్ అనే నేను విడుదల అయ్యాక.. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్‌లో బిజీ కావడం, ద్వితీయార్థంలో వచ్చే ముఖ్యమైన పాత్రకు ఏ హీరోను తీసుకోవాలో అనే విషయంలో తర్జనభర్జనల కారణంగా మరింత ఆలస్యం అయింది. ఈ పాత్ర నిడివి 15 నిమిషాలు మాత్రమేనని, మహేష్ బాబు ఈ పాత్ర చేస్తాడని వార్తలు వచ్చాయి. తర్వాత రామ్ చరణ్‌ను తీసుకున్నాక పాత్ర నిడివి కూడా పెరిగిందని, కొరటాల ఒక సందర్భంలో చెప్పారు. సెకండాఫ్ పూర్తిగా సిద్ధ పాత్ర ఉంటుందని తెలిపాడు.


కరోనావైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో టాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. తెలుగులో మొదట విడుదల కానున్న పెద్ద చిత్రం పుష్ప. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్, 14వ తేదీన రాధేశ్యామ్ విడుదల కానుంది. జనవరి 12వ తేదీన భీమ్లా నాయక్, 13వ తేదీన సర్కారు వారి పాట విడుదల కావాల్సి ఉండగా.. ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో ఇవి రెండూ వేరే తేదీకి షిఫ్ట్ అవ్వనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. 


Also Read: 'నాకు నేనే కింగ్..' షణ్ముఖ్ కామెంట్ కి నాగార్జున పంచ్..


Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!


Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి