Chiranjeevi Remuneration for Anil Ravipudi Dil Raju Movie: మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ పరంగా సీనియర్ స్టార్ హీరోలు మిగతా ముగ్గురి కంటే ఓ అడుగు ముందు ఉన్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ ఖబర్. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ఆయన రికార్డ్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల కథనం. పూర్తి వివరాల్లోకి వెళితే...
కొత్త ఏడాదిలో కొత్త సినిమాలు రెండు స్టార్ట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఆయన హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే... ఇంకా చిరంజీవి షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఈ సినిమాకు 'విశ్వంభర' టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. అయితే... అదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. 'విశ్వంభర' కోసం త్వరలో మేకప్ వేసుకోనున్నారు. ఈ సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ 40 కోట్లు అని టాక్. దాని తర్వాత సినిమాతో 50 కోట్ల క్లబ్బులో చేరుతున్నారట.
చిరంజీవి @ 50 కోట్ల క్లబ్!
Anil Ravipudi to direct Chiranjeevi: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు 'దిల్' రాజు ప్రయత్నాలు చేస్తున్నారనేది తెలిసిన విషయమే. ఆ సినిమాకు గాను చిరుకు 50 కోట్లు ఇవ్వడానికి దిల్ రాజు రెడీ అయ్యారట.
Also Read: దేవర ఆడియో @ బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... ఈ నలుగురిలో 50 కోట్ల క్లబ్బులో ముందుగా చేరింది మెగాస్టారే. ప్రజెంట్ బాలకృష్ణ ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల వరకు తీసుకుంటున్నారు. 'నా సామి రంగ'కు నాగార్జున 10 కోట్లు తీసుకున్నారని టాక్. వెంకటేష్ రెమ్యూనరేషన్ సైతం ఇంచుమించు 10 కోట్లకు ఇటు ఇటుగా ఉంది.
'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ రెడీ!?
అనిల్ రావిపూడి డైరెక్షన్ అనేసరికి మెగా అభిమానులు, ప్రేక్షకులు 'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ ఆశిస్తున్నారు. చిరంజీవిలో వింటేజ్ కామెడీ టైమింగ్ బయటకు తీసే సత్తా అనిల్ రావిపూడికి ఉందని, ఆయన శైలి కామెడీకి మెగాస్టార్ తోడు అయితే భలే ఉంటుందని అనుకుంటున్నారు. మరి, అనిల్ రావిపూడి మనసులో ఏం ఉందో!?
Also Read: కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?
మెగా హీరోలతో 'దిల్' రాజు సినిమాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' చేశారు. అంతకు ముందు రామ్ చరణ్ హీరోగా 'ఎవడు' సినిమా చేశారు. ప్రస్తుతం ఆయనతో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. అయితే... మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటి వరకు 'దిల్' రాజు సినిమా చేయలేదు. ఇది తొలి సినిమా అవుతుంది. 'భగవంత్ కేసరి', 'సరిలేరు నీకెవ్వరు' మినహా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటినీ 'దిల్' రాజు నిర్మించారు. 'సరిలేరు...'లో కూడా ఆయన నిర్మాణ భాగస్వామి.