దుగ్గిరాల వారసుడు రాజ్ తో స్వప్న పెళ్లి చేయాలని కనకం ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగానే దుగ్గిరాల ఇంట్లో జరిగే ఫంక్షన్ లో స్వప్నతో డాన్స్ వేయించాలని అనుకుంటుంది. అక్కడ డాన్స్ చేయాలసిన అమ్మాయిని కిందపడేలా చేసి తప్పింది తన స్థానంలో స్వప్నని పెడుతుంది. స్వప్నకి డాన్స్ రాకపోవడంతో కావ్యని నేర్పించమని అడుగుతుంది. అందరి ముందు ఎలా అనేసరికి అక్కడే ఉన్న ఒక తెల్లారి పరదా వేసి డాన్స్ నేర్పిస్తుంది. ఆ నీడని రాజ్ చూస్తాడు. తనని అలా చూస్తూ మైమర్చిపోయిన రాజ్ ఎవరు డాన్స్ చేస్తుందని చూసేసరికి అక్కడ స్వప్న ఉంటుంది.
Also Read: నందుకి బిజినెస్ ఐడియా ఇచ్చి సాయం చేసిన తులసి- అడ్డం తిరిగిన ప్రేమ్
ఇక ఈరోజు ప్రోమోలో ఏముందంటే.. స్వప్న సంపన్నురాలు అనుకుని రాజ్ తనతో మాట్లాడతాడు. తన కారులో డ్రాప్ చేస్తానని అడుగుతాడు. కానీ స్వప్న మాత్రం వద్దని తమ కారులోనే వెళ్తామని చెప్తుంది. తీరా కనకం ఎవరికి కనిపించకుండా స్వప్నని తీసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోవడం రాజ్ అత్తయ్య రుద్రాణి చూసేస్తుంది. కారు, డ్రైవర్ అన్ని షేర్ ఆటో ఎక్కి వెళ్తున్నాయా? ఈ తోలుబొమ్మలాటని ఇక నుంచి ఎలా నడిపించాలో నేను డిసైడ్ చేస్తానని అనుకుంటుంది. స్వప్నని రాజ్ కి దగ్గర కాకుండా ఇక తన పిన్ని అడ్డుకుంటుంది.
బుధవారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రాజ్ కి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తారు. అందరూ రాజ్ కి కంగ్రాట్స్ చెప్తారు. విగ్రహం చేయించడంలోనే పర్ఫెక్ట్ గా చేయలేకపోయావ్ ఇక కంపెనీ బాధ్యతలు ఏం చేస్తావో అని రాహుల్ తల్లి రుద్రాణి వెటకారంగా అంటుంది. అదేంటో అత్తయ్య నువ్వు తిట్టినా కూడా డిగ్నిఫైడ్ గా ఉంటుందని అంటాడు. ఇక పూజ పూర్తయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అదంతా చూసి కనకం తెగ సంబరపడిపోతూ హడావుడి చేస్తుంది. మరోవైపు కావ్య తన అక్క స్వప్నకి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. కాసేపటికి స్వప్న స్టేజ్ మీద డాన్స్ పర్ఫామెన్స్ ఇస్తూ ఉంటుంది. ఎదురుగా కావ్య నిలబడి తనకి స్టెప్స్ చూపిస్తూ ఉంటుంది. ఇందాక డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే చూశాను చాలా బాగా చేస్తుంది కదా అని మైమరిచిపోతూ తన్నే చూస్తూ ఉంటాడు. బాగా డాన్స్ చేస్తుందని స్వప్న ని మెచ్చుకుంటాడు.
Also Read: అభికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన భ్రమరాంబిక- వేద మీద అమితమైన ప్రేమ చూపించిన యష్
అప్పుడే స్వప్న కాలు కింద నిప్పు రవ్వ చూసి దాని మీద ఎక్కడ కాలు వేస్తుందోనని కావ్య పరుగున వెళ్ళి చెయ్యి అడ్డు పెడుతుంది. దీంతో స్వప్న పడబోతుంటే రాజ్ పట్టుకుంటాడు. కావ్య మీద నోరు పారేసుకుంటాడు. మా ప్రోగ్రామ్ లో నువ్వు ఎందుకు దూరావ్ అని తనని నోటికొచ్చినట్టు తిడతాడు. కళ్యాణ్ వచ్చి తను రాను అంటే నేనే తీసుకొచ్చానని చెప్తాడు. ఇద్దరూ కాసేపు గొడవపడతారు. రాజ్ గొడవపడుతుంటే స్వప్న అడ్డుపడి ఆపుతుంది. కావ్య తనని అక్క అని పిలిచేసరికి కోపంగా అరుస్తాడు.