తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 3తో ముగియనుంది. జనవరి 6న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాంగా.. జనవరి 27తో ముగియాల్సిన దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికవరకు దరఖాస్తు చేసుకోలేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  


పోస్టుల వివరాలు..


ఖాళీల సంఖ్య: 581


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -1): 05 పోస్టులు
విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్.


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్ -2): 106 పోస్టులు
విభాగం: ట్రైబ‌ల్ వెల్ఫేర్.


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు: 70
విభాగం: ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌.


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్): 228
విభాగం: ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌.


➥ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (): 140
విభాగం: బీసీ వెల్ఫేర్.


➥ వార్డెన్ (గ్రేడ్ -1): 05
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.


➥ మ్యాట్రన్ (గ్రేడ్ -1): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.


➥ వార్డెన్ (గ్రేడ్-2): 03
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.


➥ మ్యాట్రన్ (గ్రేడ్-2): 02
విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్.


➥ లేడి సూప‌రింటెండెంట్: 19
విభాగం: చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.


అర్హత: డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో ఉంటాయి.  


జీతభత్యాలు..


➨ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్-1) పోస్టులకు రూ.38,890 – రూ.1,12,510 ఇస్తారు. 


➨ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(గ్రేడ్-2) పోస్టులకు రూ.35,720 – రూ.1,04,430 ఇస్తారు.


➨ వార్డెన్, మ్యాట్రన్ (గ్రేడ్-1) పోస్టులకు రూ.38,890 – రూ.1,12,510 ఇస్తారు.


➨ వార్డెన్, మ్యాట్రన్(గ్రేడ్-2), లేడీ సూపరింటెండెంట్ పోస్టులకు రూ.35,720 – రూ.1,04,430 ఇస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.01.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.01.2023. (03.02.2023 వరకు పొడిగించారు)


➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.01.2023.


Notification


Online Appication

Website


Also Read:


'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియను అధికారులు పొడిగించారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జనవరి 30 వరకే దరఖాస్తుకు అవకాశం ఉంది. అయితే దరఖాస్తు సమయంలో సాంకేతిక కారణాల వల్ల అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో మరో నాలుగురోజులపాటు పొడిగిస్తూ నిర్ణయంతీసుకున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య 8 లక్షలు దాటిన సంగతి తెలిసిందే. 
ఆన్‌లైన్ దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...