బరువు తగ్గాలన్న లక్ష్యంతో ఉన్నవారికి కొత్తకొత్త వర్కవుట్ విధానాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ప్రతి రోజూ ఉదయాన్నే 6 గంటలకు అలారం సెట్ చేసుకుని గంటన్నర సెషన్ వర్కవుట్ కు కేటాయించే బదులు.. కాసేపు హాయిగా పడుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. అదేంటీ? అలాగైతే బరువు ఎలా తగ్గుతామనేగా మీ సందేహం? అయితే చూడండి. 


ఇలాంటివి నిజమేనా అనే అనుమానం రావడం సహజం. సెలెబ్రిటి టైనర్ సిసిలియా హారీస్ ఈ విషయాన్ని బలంగా నమ్ముతున్నారు. ఆమె ఫ్రాంకి బ్రిడ్జ్, ర్యాన్ థామస్, లూసీ మెక్లెన్ బర్గ్, సువన్నా రీడ్ లవంటి సెలెబ్రిటీలకు పర్సనల్ కోచ్. RWL అనే ఫిట్ నెస్ ఆప్ రూపకర్త. దాదాపుగా 30 సంవత్సరాల ఇండస్ట్రీలో అనుభవం గడించిన నిపుణురాలు. ఆమె తన క్లయింట్లకు ఈ రకమైన వర్కవుట్ మొదలు పెట్టిన తర్వాత మంచి ఫలితాలు కనిపించాయని అంటున్నారు.


మనం బరువు తగ్గాలని అనుకున్నపుడు వర్కవుటే అన్నింటికంటే మంచి సాధనం. కేలరీలు ఖర్చుచెయ్యడం అన్నింటికంటే ముఖ్యం. ఆహార పానీయాల ద్వారా శరీరం గ్రహించిన కేలరీలకు మించి మనం ఖర్చుచెయ్యాల్సి ఉంటుంది. శరీర కదలికల ద్వారా శక్తి వినియోగం జరుగుతుంది. వర్కవుట్ ద్వారా ఈ శక్తి వినియోగం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఫలితంగా శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలు తగ్గుతాయి.


నా పని నా క్లయింట్లకు ఆరోగ్యవంతమైన, ఫిట్ గా ఉండే శరీరాన్ని తయారు చెయ్యడం. అందుకే నేను ప్రతి సారీ వర్కవుట్ చెయ్యమని మోటివేట్ చెయ్యడం ఒక్కటే పనిగా పెట్టుకోను. చాలా తక్కువ సమయం పాటు వర్కవుట్ చేసినా మీరు బరువు తగ్గుతారని వారికి నేను నమ్మకం కలిగిస్తానని పేర్కొన్నారు. 


బరువు తగ్గి ఫిట్ గా ఉండేందుకు వర్కవుట్ అనేది జీవితంలో భాగంగా మార్చుకోవాలి. అది కూడా జీవితాంతం కొనసాగించాలి. అదీ కాక ఎక్కువ వర్కవుట్ చేసి తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలు ఆశించడం దురాశే అవుతుంది. వర్కవుట్ మొదలు పెట్టగానే ఏదో చమత్కారం జరుగుతుందని అనుకోకూడదు అనేది సిసిలియా అభిప్రాయం. ఇలా మాట్లాడడం వల్ల మీలో ఎక్సెపెక్టేషన్స్ తగ్గిపోవచ్చు. కానీ ఇలాంటి మైండ్ సెట్ ఆరోగ్యానికి మంచిది.


కొద్ది పాటి వ్యాయామం అయినా సరే దీర్ఘకాలం పాటు చేస్తామని ముందుగా మనసులో నిర్ణయించుకోవాలి. వెంటనే ఫలితాల వైపు చూడకూడదని ఆమె సలహా ఇస్తున్నారు. వారానికి మూడు సార్లు సెషన్ కు 20 నిమిషాలు వ్యాయామం తప్పక చేస్తామని మీకు మీరు మాట ఇచ్చుకొమ్మని చెబుతున్నారు.


ఎందుకంటే ప్రతి రోజూ గంట పాటు వర్కవుట్ కు కేటాయించలేకపోవచ్చు. మీకు అంత సమయం ఉండకపోవచ్చు. కానీ వారంలో మూడు సార్లు సెషన్ కు 20 నిమిషాలు అంటే చాలా సులభంగా టైం దొరుకుతుంది. రోజూ గంట సమయం లేదన్న సాకుతో వర్కవుట్ స్కిప్ చేసే వారే ఎక్కువ. టైం తగ్గించుకుంటే వారమంతా వర్కవుట్ వదిలేయడం కంటే కొద్దికొద్దిగా అయినా వర్కవుట్ కచ్చితంగా చెయ్యడం వల్ల ఫలితాలు రాబట్టడం సులభం అవుతుంది.


మన శరీరం చాలా అద్భుత సృష్టి. శక్తి వినియోగిస్తే తిరిగి కూడగట్టుకుంటుంది. ఎంత చురుకుగా ఉంటే అంత ఆకలి వేస్తుంది. బరువు తగ్గాలన్న ఆలోచనతో మీరు తిండి తగ్గించాలని అనుకుంటారు. అందుకే ఎక్కువ వ్యాయామం చేస్తే ఎక్కువ ఆకలి తప్పకుండా ఉంటుంది. ఎక్కువ తినేస్తే తిరిగి బరువు పెరగడం మొదలవుతుంది. కనుక బ్రేక్ లేకుండా ప్రతి రోజూ వర్కవుట్ చేసే అవసరం లేదు. కనుక వారానికి మూడు సార్లు 25 నిమిషాల వర్కవుట్ చాలు అనేది సిసిలియా అభిప్రాయం మాత్రమే కాదు.. తన అనుభవం కూడా అంటున్నారు.


ఇలా తేలికైన వర్కవుట్ల వల్ల గాయాల బెడద కూడా ఉండదు. పెద్దపెద్ద వర్కవుట్లు గంటల తరబడి చేసి గాయాల పాలైతే మళ్లీ వర్కవుట్ కు బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది మరింత బరువు పెరిగేందుకు కారణమవుతుంది. కొన్ని రకాల వర్కవుట్లు వారంలో కొన్ని రోజుల పాటు రెగ్యులర్ గా ఎక్కువ కాలం పాటు కొనసాగించేలా ప్లాన్ చేసుకోవాలి. ఒక్క చిన్న బ్రేక్ తర్వాత వర్కవుట్ విధానాన్ని మళ్లీ మార్చుకోవాలి. కొంత ఇంటెన్సిటి పెంచుకునేందుకు కొంత సమయం ఇవ్వాలి. మొత్తానికి వర్కవుట్ అనేది దీర్ఘకాలిక ప్రక్రియ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణుల సూచిస్తున్నారు. 


Also read: గీజర్‌లో ఉండే గ్యాస్ లీక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకోండి