బాలీవుడ్ బోల్డ్ సినిమా ‘ది డర్టీ పిక్చర్’. అందులోని “ఊలల్లా.. ఊలల్లా..” సాంగ్ అప్పట్లో అందరినీ ఓ ఊపు ఊపింది. ఈ పాటలో విద్యా బాలన్ అందాలు ఆరబోసింది. ఇప్పుడు ఇదంటే ఎందుకని అనుకుంటున్నారా? ఎందుకంటే డర్టీ పిక్చర్ కి సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏక్తా కపూర్ ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో మళ్ళీ విద్యా బాలన్ మాత్రం నటించడం లేదు. ఈ సినిమాలో నటించేందుకు కంగనా రనౌత్ ని కూడా సంప్రదించారట. అయితే ఇందులో నటించేందుకు ఆమె సుముఖత చూపించలేదు.
ప్రముఖ రచయిత కనికా థిల్లాన్, మరొక రచయితతో కలిసి ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తున్నారు. ‘రష్మి రాకెట్’, ‘హసీన్ దిల్రుబా’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కనికా స్క్రిప్ట్ అందించారు. ప్రస్తుతం ‘డర్టీ పిక్చర్ 2’ సినిమా స్క్రిప్ట్ బాధ్యతలని కూడా ఏక్తా కపూర్ ఆమెకి అప్పగించారట. ఈ ఏడాది చివరి నాటికి స్క్రిప్టు పనులు పూర్తి చేసి సినిమాను పట్టాలెక్కించాలని ఏక్తా ప్లాన్ చేస్తున్నారు. ఏక్తా, బాలాజీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట.
ఈ సినిమాలో నటించేందుకు ఏక్తా.. తొలుత కంగనాను సంప్రదించారట. కానీ ఈ ఆఫర్ ని కంగనా సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. అటువంటి సినిమాలో నటించడం వల్ల తనకున్న మంచి పేరు చెడిపోతుందని ఆ ఆఫర్ ని కంగనా చేయనని చెప్పేసిందట. తాప్సీ, కృతి సనన్ ఈ సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారట. స్క్రిప్ట్ పనులు పూర్తైన తర్వాత నటులని ఎంపిక చెయ్యాలని ఏక్తా నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
ప్రముఖ నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా 2011 లో ‘డర్టీ పిక్చర్’ సినిమా వచ్చింది. అందులో విద్యా బాలన్ నటించింది. అయితే ఈ సినిమాలో చివర్లో విద్యా బాలన్ చనిపోతుంది. మరి కొత్తగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కథ ఏంటా అని అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో విద్యా బాలన్ నాటనకి గాను జాతీయ అవార్డు కూడా లభించింది. మిలన్ లూథ్రియా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నసిరుద్ధీన్ షా, ఇమ్రాన్ హష్మి కీలక పత్రాలు పోషించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కూడా వచ్చింది.
సిల్క్ స్మిత పలు భాషల్లోని సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నటిస్తూ ఎంతో పేరు తెచ్చుకుంది. తెలుగులో సుమన్, కృష్ణం రాజు నటించిన సినిమాలో ‘బావలు సయ్యా.. మరదలు సయ్యా..’ పాటలో నటించింది. కెరీర్ మంచి రూట్ లో ఉన్న సమయంలోనే తను ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇప్పటికీ సిల్క్ స్మిత ఆత్మహత్య ఎందుకు చేసుకునే విషయం మిస్టరీగానే మిగిలిపోయింది.
Also Read: ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?
Also Read: రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు