గుప్పెడంతమనసు ఆగస్టు 18 గురువారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 18 Episode 532)


జగతి అండ్ కో మొత్తం రెస్టారెంట్లో ఉంటారు. మహేంద్ర,గౌతమ్ సందడి చూసి జగతి కూడా హాయిగా నవ్వుతుంది. సాక్షి గొడవ పోయిందంటే ఇదింకా నేను నమ్మలేకపోతున్నా అంటాడు గౌతమ్. ఇంత చేసిన సాక్షి తనంతట తాను వద్దనుకుని వెళ్లడం నిజంగా ఆశ్చర్యమే..నాకైతే రెండు మూడు తీన్మార్ స్టెప్పులేయాలని ఉందంటాడు మహేంద్ర. కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుందామా అని అడిగిన గౌతమ్..కేక్ కట్ చేసి అందరికీ పంచుదాం అంటాడు. ఎందుకీ కేక్ అని అడిగితే ఏం చెబుదాం అన్న జగతి..ఓ మంచి జరిగిందని చెప్పండి అని సలహా ఇస్తుంది... అప్పుడే ఎంట్రీ ఇస్తారు వసుధార,రిషి... వీళ్లిద్దరూ ఎప్పుడు కలిశారో అనుకుంటారు...
మీరెందుకు ఇక్కడకు వచ్చారని రిషి అడగడంతో..వెంటనే గౌతమ్ కేక్ అంటూ నోరు జారుతాడు. వెంటనే మహేంద్ర మా ఫ్రెండ్ కేకే రావు వస్తాడని కవర్ చేస్తాడు.మీరెక్కడ కలిశారని అందరూ అడగడంతో. రాబోయే ఎగ్జామ్స్ ని ఎలా ఎదుర్కోవాలో చర్చించుకున్నాం అని అబద్ధం చెబుతాడు రిషి. వసు అందరికీ కాఫీ తెచ్చి ఇస్తుంది.. వసుని కూడా కూర్చోమన్న రిషి.. తన కాఫీని షేర్ చేసి ఇస్తాడు. వాళ్లిద్దర్నీ చూసి జగతి-మహేంద్ర, గౌతమ్ మురిసిపోతారు...


Also Read:  శౌర్యకి వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప, ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు -మోనిత కోసం వెయిటింగ్


ఇంట్లో దేవయాని తప్ప అందరూ భోజనానికి కూర్చుంటారు. పెద్దమ్మ ఎక్కడ వదిన అని అడుగుతాడు. ఎందుకో డల్ గా ఉన్నట్టుంది రిషి అని మహేంద్ర చెబుతాడు. అత్తయ్య రూమ్ కి భోజనం తీసుకెళతాను అంటుంది ధరణి. పాపం పెద్దమ్మ నా గురించి బెంగపడుతుందేమో అనుకుంటూ రిషి..దేవయాని రూమ్ కి వెళతాడు. ఆ సమయంలో జగతి మనసు కాస్త భారంగా అనిపించడంతో ఎమోషనల్ అవుతుంది. తినకుండా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి దేవయాని కి అన్నం తినిపిస్తూ ఉంటాడు. నువ్వు నాకు భోజనం తేవడం ఏంటి చెప్పు అంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది. పెద్దమ్మా మీ ప్రేమలో స్వార్థం లేదంటాడు. ఇక దేవయాని తన మనసులో రిషికి నా మీద చాలా ప్రేమ ఉంది అని కానీ నాది నాటకం అని తనకి తెలిస్తే నన్ను క్షమించడని అనుకుంటుంది. మళ్లీ సాక్షి టాపిక్ తీస్తుంది. 
రిషి: ఇప్పుడు సాక్షి గురించి ఎందుకు చెప్పండి..తన ప్రేమ మోసం, తన ప్రేమ అబద్ధం, తనంతట తానుగా వెళ్లిపోయింది కదా పెద్దమ్మా..వదిలేయండి అంటాడు. డబ్బు విషయంలో మోసపోయినా భరిస్తాను కానీ నా దగ్గర నటించేవాళ్లంటే నాకు చాలా కోపం పెద్దమ్మా అంటాడు..
దేవయాని: ఆ మాటలు దేవయానికి తగిలేలా ఉండడంతో పొలమారుతుంది.. నా విషయంలో నిజం తెలిస్తే రిషి ఏం చేస్తాడో..
రిషి: జీవితమే ఓ నాటకరంగం అన్నారుకదా అని జీవితంలో చాలామంది నటిస్తుంటారు..నిజ జీవితంలో నటించేవాళ్లంటే నాకు అసహ్యం..
దేవయాని: నా విషయంలో నిజం తెలిస్తే మెడపట్టుకుని గెంటేస్తాడేమో..తలుచుకుంటేనే ఏదోలా ఉందనుకుంటూ.. ఈ నాటకాలు అవి వాటిగురించి మనకెందుకు చెప్పు అంటుంది..
దేవయానికి అన్నం తినిపిస్తున్న రిషిని చూసి..జగతి తనకు అన్నం తినిపిస్తున్నట్టు ఊహించుకుంటుంది. ఇంతలో మహేంద్ర వచ్చి..త్వరలోనే వదిన బాగోతం బయటపడుతుంది కాస్త వెయిట్ చేయి అంటాడు.


Also Read: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి
అక్కడ వసుధార..ఆహా..ఇవాళ కడుపునిండిపోయినట్టుంది..ఇక భోజనమే అవసరం లేదు అనుకుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి క్యారియర్ ఇచ్చి..ఓ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లిపోతాడు. రిషికి కాల్ చేస్తుంది వసుధార..
వసు: సార్ క్యారేజీ ఎందుకు పంపించారు.. 
రిషి: తినడానికి పంపించాను..వంట చేసుకున్నావా 
వసు: తినాలని అనిపించలేదని చేసుకోలేదు
రిషి: అసలే పరీక్షలున్నాయి..హెల్దీగా ఉండడం అవసరం ..పంపించింది మొత్తం తిను
వసు: ఇందులో ఏమున్నాయ్..
రిషి: పంపించాను కదా..ఓపెన్ చేసి చూడు అని కాల్ కట్ చేస్తాడు


Also Read:  ఈ పెళ్లి వద్దు, రిషి వద్దంటూ నరసింహలో రమ్యకృష్ణలా శపథం చేసిన సాక్షి - ప్రేమను ప్రేమించానంటూ కూల్ గా చెప్పిన రిషి


ఉదయాన్నే వంటగదిలోకి వెళ్లిన రిషి వదిన కాఫీ అనడంతో అక్కడ జగతి ఉంటుంది. ధరణిని పిలవమంటారా సార్ అంటుంది. వద్దులెండి అనడంతో కాఫీ ఇమ్మంటారా సార్ అంటే..ఓకే అంటాడు. ఆనందంలో మునిగిపోయిన జగతి..మీరు వెళ్లండి సార్ నేను కాఫీ తీసుకొస్తాను అంటుంది
రిషి: మేడం చిన్న రిక్వెస్ట్
జగతి: చెప్పండి సార్.. రిషి రిక్వెస్ట్ అన్నాడంటే ఏదో జరుగుతున్నట్టే
రిషి: మీరు నన్ను రిషిసార్ అని పిలవకండి.. రిషి అని పిలవండి  ( రిషి మాటలు విన్న మహేంద్ర ఆశ్చర్యపోతాడు). మీకు నాకు ఉన్న బంధం గురించి మాట్లాడదల్చుకోలేదు..మీరు నన్ను ఇకనుంచి రిషి అనే పిలవండి. కొన్ని విషయాల్లో నేను కరెక్ట్ కావొచ్చు..మరికొన్ని విషయాల్లో మీరు కరెక్ట్ కావొచ్చు..ఒకే ఒక్క విషయంలో తప్ప ప్రతివిషయంలోనూ మీకు నాకు అభిప్రాయాలు కలుస్తాయి..ఆ విషయం గురించి నేను మాట్లాడొద్దని నిర్ణయించుకున్నాను..మాట్లాడను కూడా..నేను మీకు ఓ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి..నాకు ఏం నచ్చుతుందో ఏం నచ్చదో మీకు ఇంతగా తెలుసని నాకు తెలియదు..వసుధార కోసం మీరు ఎంతో చేశారు..తను తన చివరి లక్ష్యం అందుకోబోతోంది..అప్పుడు కూడా తనకి మీరు సహకరించాలి..మీరు సహకరిస్తరని నాకు తెలుసు..ఇంతకంటే నేను ఏమీ చెప్పలేనంటూ జగతి మొహం చూస్తాడు..కన్నీళ్లతో  నిండి ఉంటుంది.. కాఫీ అంటాడు..
జగతి: ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న జగతి..ఇస్తాను సార్ అనేసి..వెంటనే ఇస్తాను రిషి అంటుంది..
కాఫీ తీసుకొచ్చి తీసుకో రిషి అంటుంది..ఇంతలో మహేంద్ర వచ్చి రిషి అని పిలుస్తాడు... ఎపిసోడ్ ముగిసింది..